IDBI బ్యాంకు పేరు మార్పు కు నో చెప్పిన RBI

    0
    14

    ఐడీబీఐ బ్యాంక్‌ పేరు మార్చడానికి వీల్లేదని ఆర్‌బీఐ నేడు తేల్చిచెప్పింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం తరపున ఎల్‌ఐసీ దాదాపు 51శాతం వాటాలను కొనుగోలు చేయడంతో పేరు కూడా మార్చాలని ప్రతిపాదన వచ్చింది.

     దీనికి సంబంధించి ‘ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌’ లేదా ‘ఎల్‌ఐసీ బ్యాంక్‌’గా పేరు మార్చాలని గత వారం బోర్డు ఆర్‌బీఐకు ప్రతిపాదన పంపింది. ఈ విషయాన్ని ఐడీబీఐ బ్యాంక్‌ ఇటీవల రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి పేరు మార్చడానికి అవకాశం లేదని ఆర్‌బీఐ వెల్లడించింది.

    ఈ నెల మొదటి వారంలో ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌ను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగ బ్యాంకుల జాబితాలో చేర్చింది. ఈ డీల్‌కు ముందు ఐడీబీఐలో ప్రభుత్వానికి 86శాతం వాటా ఉండగా ఎల్‌ఐసీకు 8శాతం వాటా ఉంది. ఈ డీల్‌ తర్వాత ఎల్‌ఐసీ వాటా 51శాతానికి చేరగా ప్రభుత్వం వాటా 46.46 వద్దకు చేరింది.

    ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఉన్న రాకేష్‌ శర్మ పదవీ కాలం ఏప్రిల్‌ చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈయన పదవీకాలాన్ని మరో మూడేళ్లకాలానికి పొడిగించాలని బ్యాంకు యోచిస్తోంది. గత అక్టోబరులో ఆరు నెలల కాలానికి శర్మను బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రభుత్వం నియమించింది.