DRDL డైరెక్టర్ గా డాక్టర్ దశరథ్ రామ్

    0
    3

    హైద‌రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీస్ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్‌గా డాక్టర్ దశరథరాం నియమితులయ్యారు.

    క్షిపణుల అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల(DRDL) డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ దశరథ్రామ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు.

    ప్రోగ్రామ్ డైరెక్టర్ గా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారు. హైపర్సోనిక్ విండ్ టన్నెల్ సిస్టమ్ అభివృద్ధితో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది.
    దీర్ఘశ్రేణి క్షిపణుల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో అపారమైన కృషి చేశారు.
    ఈ మేరకు భారత ప్రభుత్వం అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డెరైక్టర్‌గా కొనసాగిన ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్.ఆర్.ప్రసాద్ రక్షణ రంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టం (ఎంఎస్‌ఎస్)కు డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డాక్టర్ దశరథరాం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.