AP లో నూతన మద్యం విధానం

    0
    6

    మద్యం అమ్మకాలు తగ్గించడమే కాకుండా మద్యం విరివిగా దొరకకుండా మద్యం దుకాణాలను 20 శాతం తగ్గించారు.

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అక్టోబర్ ఒకటవ తేదీ నుండి అమలుకానుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో నిర్వహించబడిన మద్యం దుకాణాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3,500 మద్యం దుకాణాల్నిప్రభుత్వమే నిర్వహించనుంది.

    ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి.

    ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుండటంతో అధిక ధరలకు విక్రయాలు, నకిలీ మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉంది.