7 విడతల్లో 17వ లోక్‌సభ ఎన్నికలు

  0
  7

  పదిహేడో లోక్‌సభకు ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది.

  ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలతో కలసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా March 10 న ప్రకటించారు

  *2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

  *ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. *జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించడంలేదని స్పష్టంచేశారు. భద్రతా బలగాల లభ్యత దృష్ట్యా ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు.

  *ప్రతి ఈవీఎంతో పాటు వీవీప్యాట్‌ల వినియోగం

  *ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా

  ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం ఈసారి ఎన్నికల ప్రత్యేకత. ఇందుకు వీవీప్యాట్ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు

  ఈవీఎంలపై అత్యంత నిపుణులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఐఐటీ డిల్లీకి చెందిన డీటీ సహాని, ఐఐటీ బిలాయ్‌ డైరెక్టర్‌ రజత్‌మోనా, ఐఐటీ ముంబాయికి చెందిన ప్రొఫెసర్‌ దినేష్‌ కే శర్మలతో కూడిన కమిటీ వీటిని పర్యవేక్షిస్తోంది.