59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం

    0
    12

    లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ)లు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటి దాకా రుణాలు పొందవచ్చు.

    ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లడుతూ… నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్‌ఎంఈలు చేసే ఎగుమతులకు ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. మొత్తం మీద ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

    ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5-75 కోట్ల దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250 కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.