31 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  # మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్‌
  # పర్యావరణ హితం-ఎకో రైల్వేస్టేషన్‌గా విజయవాడ
  # ప్రపంచంలోనే తొలి 5జీ కవరేజీ కలిగిన ప్రాంతంగా షాంఘై

  మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్‌

  మూడు ప్రభుత్వ రంగ బ్యాంకు లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్‌, దేనాబ్యాంక్‌ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, న్యాయమూర్తి వినీత్‌ శరణ్‌ నేతృత్వంలోని డివిజనల్‌ బెంచ్‌, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది.
  *విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది.

  పర్యావరణ హితం-ఎకో రైల్వేస్టేషన్‌గా విజయవాడ

  * దేశంలో రెండవ అతిపెద్ద జంక్షన్‌ నవ్యాంధ్రలో అత్యంత కీలకమైన రైల్వేస్టేషన్‌గా విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎకో రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి రైల్వేశాఖ ఎంపిక చేసింది.
  * భారత ప్రమాణాల సంస్థ ఐఎస్‌ఓ – 14001 ప్రమాణాల మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడు రైల్వే స్టేషన్లను ఎకో రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  * రైల్వే శాఖ ఎంపికచేసిన మూడు స్టేషన్లలో సికింద్రబాద్‌, కాచిగూడ, విజయవాడ స్టేషన్లు ఉన్నాయి.
  *దేశవ్యాప్తంగా 36 రైల్వేస్టేషన్లను ఎకో స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని ఇండియన్‌ రైల్వేస్‌ నిర్ణయించింది.

  ప్రపంచంలోనే తొలి 5జీ కవరేజీ కలిగిన ప్రాంతంగా షాంఘై

  5జీ కవరేజీ, బ్రాడ్‌బ్యాండ్‌ గిగాబిట్‌ నెట్‌వర్క్‌లు రెండింటిని ఉపయోగిస్తున్న ప్రపంచంలోనే తొలి జిల్లాగా శనివారం చైనాలోని షాంఘై అవతరించింది. భవిష్యత్తు తరం సెల్యులర్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌ అభివృద్ధిలో అమెరికా తదితర దేశాలపై పైచేయి సాధించాలని భావిస్తున్న చైనా ఎట్టకేలకు ముందడుగు వేసింది. 5జీ అనేది తర్వాతి తరం సెల్యులర్‌ సాంకేతిక పరిజ్ఞానం. ఇది 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌లకన్నా 10 నుంచి 100 రెట్లు అధిక డౌన్‌లోడ్‌ వేగం కలిగి ఉంటుంది. 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పరీక్షల్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. తొలి 5జీ వీడియో కాల్‌ను షాంఘై ఉపమేయర్‌ చేశారు.