31 జులై కరెంట్ అఫైర్స్ 2019

  0
  9

  # కొత్త ఫైనాన్స్ సెక్రటరీగా రాజీవ్ కుమార్
  # భారత రెజ్లింగ్ కోచ్‌గా అశోక్ కుమార్
  # ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్‌గా చక్రవర్తి
  # అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు

  కొత్త ఫైనాన్స్ సెక్రటరీగా రాజీవ్ కుమార్

  ఆర్థిక సేవల కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ కుమార్ జూలై 30న కొత్త ఫైనాన్స్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) ఈ నియామకానికి ఆమోదముద్ర వేసింది. కుమార్ 1984 జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, మూలధన కల్పన వంటి అంశాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది.

  భారత రెజ్లింగ్ కోచ్‌గా అశోక్ కుమార్

  రెజ్లింగ్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో ఎన్నో ఘనతలు సాధించిన కరీంనగర్ జిల్లా యువజన క్రీడాశాఖాధికారి డి. అశోక్ కుమార్ భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. సోఫియా (బల్గేరియా) వేదికగా వచ్చే నెల 4 వరకు జరిగే అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు అశోక్‌కుమార్ శిక్షకుడిగా వ్యవహరించనున్నాడు.

  ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్‌గా చక్రవర్తి

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్‌గా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నామినేట్ అయ్యారు. ఆర్‌బీఐ జూలై 30న ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.జూలై 29 నుంచీ అమల్లోకి వచ్చే ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ అమల్లో ఉంటుదని ఆర్‌బీఐ పేర్కొంది. సుభాష్ చంద్ర గార్గ్ స్థానంలో ఈ నియామకం జరిగింది.

  అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు

  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 30తో ముగిసిన పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లుగా అమలుపరుస్తున్న జర్నలిస్టుల శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలపై మీడియా అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా అల్లం నారాయణ అందజేశారు.