31 అక్టోబర్ కరెంట్ అఫైర్స్

  0
  10

  *నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎండీగా విజయ్ కరణ్ రెడ్డి
  *కేవనాఫ్ స్థానంలో భారతీయ-అమెరికన్ మహిళ!
  *మలాల యూసుఫ్ఝాహి కు గౌరవప్రదమైన Gleitsman అవార్డు
  *ఇటలీ ప్రధాని జుసపె కాంటె భారత పర్యటన
  *కృష్ణా జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది.

  *నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎండీగా విజయ్ కరణ్  రెడ్డి 

      రాష్ట్ర సాగు నీటిపారుదల సంస్థ(ఐడీసీ) ఉపాధ్యక్షుడు, ఎండీగా విజయ్ కరణ్  రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన డిండి ఎత్తిపోతల పథకంలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ స్థానంలో ఉన్న ఎం.లక్ష్మారెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేస్తుండటంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ ప్రాజెక్టుల సీఈ భగవంతరావు స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో శ్రీనివాస్రెడ్డిని నియమించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈ లింగరాజు స్థానంలో నాగర్కర్నూలు ఎస్ఈగా ఉన్న రమేష్ ను  అదనపు బాధ్యతలతో సీఈగా నియమించారు. రంగారెడ్డి చిన్ననీటిపారుదల సర్కిల్ పర్యవేక్షక ఇంజినీరుగా కేఆర్ఎంబీలో ఎస్ఈగా ఉన్న మహేందర్రెడ్డికి బాధ్యతలు ఇవ్వనున్నారు. డిండి ఈఈగా దక్షిణమూర్తిని నియమించనున్నారు.

  *కేవనాఫ్ స్థానంలో భారతీయ-అమెరికన్ మహిళ! 

      అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అంతటి శక్తిమంతమైన కొలంబియా డిస్ట్రిక్ట్‌ సర్క్యూట్‌ కోర్టులో నియామకానికి గాను భారతీయ-అమెరికన్‌ మహిళ నియోమి జహంగిర్‌ రావు(45)ను అధ్యక్షుడు ట్రంప్‌ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యవహారాల కార్యాలయ పాలనాధికారిగా పనిచేస్తున్న ఆమెను ఈ జడ్జి పదవికి శ్వేతసౌధం మాజీ కౌన్సిల్‌ డాన్‌ మెక్‌గాన్‌ సిఫార్సు చేసినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. సుప్రీంకోర్టు అసోసియేట్‌ జస్టిస్‌గా పనిచేస్తున్న బ్రెట్‌ కేవనాఫ్‌ ఇంతకుముందు ఆ పదవిలో ఉండేవారు. అప్పట్లో ఆయన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు కూడా ఎదుర్కొన్న విషయం గమనార్హం. కేవనాఫ్‌ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన స్థానంలో డిస్ట్రిక్ట్‌ సర్క్యూట్‌ కోర్టు జడ్జి పదవికి ట్రంప్‌ పలువురిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వీరిలో మరో భారతీయ-అమెరికన్‌ శ్రీ శ్రీనివాసన్‌ కూడా ఉన్నారు. మైనారిటీ మహిళగా రావు నియామకం పట్ల ట్రంప్‌ ఆసక్తితో ఉన్నట్లు వార్తాసంస్థ పేర్కొంది.

  *మలాల యూసుఫ్ఝాహి  కు  గౌరవప్రదమైన Gleitsman అవార్డు

       హార్వార్డ్ యూనివర్సిటీ ద్వారా  మలాల యూసుఫ్జై గౌరవప్రదమైన Gleitsman అవార్డు పొందనున్నారు.యూసఫ్జాయి 2014 లో నోబెల్ శాంతి బహుమతి  గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు.

  *ఇటలీ ప్రధాని జుసపె కాంటె భారత పర్యటన

      సమావేశంలో భాగంగా ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తృతం చేసుకోవాలని మోదీ-కాంటే నిర్ణయించారు. మరోవైపు న్యూఢిల్లీలో అక్టోబర్ 30న జరిగిన కేంద్ర శాస్త్ర- సాంకేతిక శాఖ (డీఎస్టీ)-సీఐఐ ఇండియా- ఇటలీ టెక్నాలజీ సమిట్లో ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని గిసెప్ కాంటే పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సాధికారత, పారదర్శకత, సమ్మిళితం సాధించేందుకు భారత్ సాంకేతికతను మాధ్యమంగా ఉపయోగించుకుంటోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

  *కృష్ణా జిల్లాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది.

      ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంలో అవగాహన కల్పించే ‘స్వీప్’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద అక్టోబర్ 30న నిర్వహించిన రంగోలీ కార్యక్రమంతో ఈ రికార్డు దక్కింది. సూమారు 2,500 విద్యార్థులు, 2 వేల మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో 4,66,279 అడుగుల విస్తీర్ణంలో భారీ స్థాయి ఇండియా మ్యాప్‌ను 30 నిమిషాల్లో రూపొందించారు.