30 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  # శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డులు
  # బీసీసీఐ నైతిక విలువల అధికారిగా డీకే జైన్
  # సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌ సంజయ్‌ జయవర్ధనవేలు

  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డులు

  జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు-జీహెచ్‌ఐఎల్ (శంషాబాద్ ఎయిర్‌పోర్టు)కు రెండు స్కైట్రాక్స్ అవార్డులు లభించాయి.
  లండన్‌లో మార్చి 28న నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్‌పో కార్యక్రమంలో జీహెచ్‌ఐఎల్‌కు ఈ అవార్డులను అందజేశారు. దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్‌పోర్టుగా జీహెచ్‌ఐఎల్ పురస్కారం గెలుచుకుంది. అలాగే విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను జీహెచ్‌ఐఎల్‌కు అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై స్కైట్రాక్స్ ఈ పుర స్కాలను ప్రకటించింది.

  బీసీసీఐ నైతిక విలువల అధికారిగా డీకే జైన్

  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నైతిక విలువల అధికారిగా బీసీసీఐ అంబుడ్‌‌సమన్ జస్టిస్ డీకే జైన్ (రిటైర్డ్) అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
  ఆయన తాత్కాలికంగా ఈ పదవిలో ఉంటారని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) మార్చి 28న ప్రకటించింది. దీంతో కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’కు సంబంధించిన కేసులను జైన్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం పాండ్యా-రాహుల్ టీవీ షో వివాదంపై ఆయన దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

  సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌ సంజయ్‌ జయవర్ధనవేలు

  కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా 2019-20 సంవత్సరానికి సంజయ్‌ జయవర్ధనవేలు ఎన్నికయ్యారు. ఆయన కోయంబత్తూరుకు చెందిన లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఐఐ- తమిళనాడు విభాగానికి 2006-07 మధ్యకాలంలో ఛైర్మన్‌గా, సీఐఐ- దక్షిణ ప్రాంత విభాగంలోని టెక్స్‌టైల్‌ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా జయవర్థనవేలు పనిచేశారు. టెక్స్‌టైల్‌ యంత్ర సామగ్రి తయారీలో ప్రపంచంలోని మూడు అతిపెద్ద కంపెనీల్లో లక్ష్మీ మెషీన్‌ వర్క్స్‌ ఒకటి. సీఐఐ- దక్షిణ ప్రాంత విభాగానికి వైస్‌ఛైర్మన్‌గా కె.సతీశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా సతీష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సీఐఐ- ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌గా పనిచేయడమే కాక వివిధ కమిటీల్లో ఆయన సేవలు అందించారు.