30 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  7

  *జీ-20 సదస్సులో పాల్గొననున్న మోదీ
  *తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొబైల్ అప్లికేషన్ ‘నా ఓటు’ను అందుబాటులోకి
  *రక్షణ మంత్రి ‘మిషన్ రక్షా జ్ఞాన శక్తి’ ని ప్రారంభించింది.
  *పాకిస్థాన్‌లో ‘కర్తార్‌పూర్’కు శంకుస్థాపన

  *జీ-20 సదస్సులో పాల్గొననున్న మోదీ
       అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
  నవంబర్ 30, డిశంబర్ 1 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి మోదీ త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ముగ్గురు దేశాధినేతలు చర్చించనున్నారు.

  *తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ‘నా ఓటు’ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
     ‘నా ఓటు’ పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గం, సౌకర్యాల వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు.
  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్.
  ఎంపికైన లోగో రూపకర్తలకు రూ.15వేలు బహుమతిగా ఇస్తామని ఆమ్రపాలి ప్రకటించారు.
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి – Dr. N. Ramesh Kumar.

  *రక్షణ మంత్రి ‘మిషన్ రక్షా జ్ఞాన శక్తి’ ని ప్రారంభించింది.
      భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ న్యూఢిల్లీలో ‘మిషన్ రక్సా జ్ఞాన శక్తి’ ని ప్రారంభించింది.
  దేని యొక్క ముఖ్య లక్ష్యం : భారత రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఐ.పి సంస్కృతిని వివరించడం.

  *పాకిస్థాన్‌లో ‘కర్తార్‌పూర్’కు శంకుస్థాపన
       సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్థాన్‌లో పంజాబ్‌లోని నరోవాల్ జిల్లా శాఖర్‌గఢ్ వద్ద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 28న శంకుస్థాపన చేశారు.
  ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లడుతూ… పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. భారత్‌లో కర్తార్ పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నవంబర్ 26న శంకుస్థాపన చేశారు.