30 అక్టోబర్ కరెంట్ అఫైర్స్

  0
  16

  *ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కారాల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  *ITAT అధ్యక్షుడిగా జస్టిస్‌ పీపీ భట్‌
  *దేశీయ జలమార్గాలపై భారతదేశం తొలి సారీ కోల్కతా నుండి వారణాసికి రవాణా
  *పెట్టుబడుల విషయంలో భారత్ కి అగ్రస్థానం
  *బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జాయర్ బోసానారు
  *కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశము

  *ప్రపంచ ఫోటోగ్రఫీ పురస్కారాల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.

      79 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం, రాష్ట్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక క్రీడల శాఖ సంయుక్తంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రపంచ ఫోటోగ్రఫీ డే పురస్కారాలను ముఖ్యమంత్రి అందజేశారు.
  ఆంధ్రప్రదేశ్ ఫోటో  జర్నలిస్టుల అసోసియేషన్ వెబ్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించాడు.

  *ITAT  అధ్యక్షుడిగా జస్టిస్‌ పీపీ భట్‌

      ఆదాయం పన్ను విభాగం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ITAT ) అధ్యక్షుడిగా గుజరాత్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీపీ భట్‌ బాధ్యతలు స్వీకరించారు.

  • న్యాయమూర్తిగా 2018 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన జస్టిస్‌ పీపీ భట్‌, సరికొత్త విధులను ఇటీవల చేపట్టారు. గుజరాత్‌ న్యాయవాదుల సంఘ సభ్యుడిగా 1984లో నమోదైన భట్‌ రాజ్యాంగ, సివిల్‌, సర్వీస్‌, క్రిమినల్‌ లా రంగాల్లో పేరు గడించారు. గుజరాత్‌ హైకోర్టు తొలి రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేశారు.
  • కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు.

  *దేశీయ జలమార్గాలపై  భారతదేశం తొలి సారీ కోల్కతా నుండి వారణాసికి రవాణా 

      అంతర్గత జలమార్గాల రంగంలో స్వాతంత్ర్యం తరువాత దేశం యొక్క మొదటి కంటైనర్  తరలింపులో  భాగంగా అక్టోబర్ 29, 2018 న, IWAI, కోల్కతా నుండి వారణాసి  వరకు PEPSICO ఇండియా కార్గోను  గంగా నది మీద (జాతీయ జలమార్గం -1) రవాణా చేస్తుంది.
  పెప్సికో (భారతదేశం) 16 కంటైనర్లను కదిలిస్తుంది – Vessel MV RN టాగోర్ ద్వారా తరలిస్తుంది. ఇది 16 truckload ల కు  సమానమైనది, ఇది వారణాసికి 9-10 రోజులలో చేరుతుంది.

  *పెట్టుబడుల విషయంలో భారత్ కి  అగ్రస్థానం

     ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
  ఈ మేరకు ‘ఎమర్జింగ్ అఫ్లూయంట్ స్డడీ 2018’ని స్టాండర్డ్ చార్టర్డ్ సంస్థ అక్టోబర్ 29న విడుదల చేసింది. ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో చార్టర్డ్ సంస్థ అధ్యయనం చేసి అప్లూయంట్ స్టడీని రూపొందించింది. ఈ స్టడీ ప్రకారం భారత్ లో సంపన్న వినియోగ వర్గాల్లో మూడింట రెండొంతుల (68 శాతం) మంది ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అనుసరిస్తున్నారు.44 శాతం మంది కెరీర్లో పురోగతి, వేతనంలో వృద్ధిని కోరుకుంటున్నారు.

  *బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జాయర్ బోసానారు

      బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసానారు ఎన్నికయ్యారు.
  అక్టోబర్ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జాయర్ కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్పై సంపూర్ణ మెజారిటీ సాధించారు. జాయర్ కు 5.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన జాయర్ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు.

  *కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశము 

      ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను జీఎస్టీ మండలి తీసుకుంది. ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

  ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టగా 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది.