29 మే కరెంట్ అఫైర్స్ 2019

  0
  24

  # మోదీ ప్రమాణానికి బిమ్స్‌టెక్ నేతలు
  # ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఘూటింగ్‌లో రెండు స్వర్ణాలు
  # విశాఖ లో సి హరియర్ మ్యూజియం

  మోదీ ప్రమాణానికి బిమ్స్‌టెక్ నేతలు

  భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిమ్స్‌టెక్ దేశాల అధినేతలను ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారుు. రాష్ట్రపతిభవన్‌లో మే 30న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) చైర్మన్, కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సూరొన్‌బే జిన్బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌ను కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. బిమ్స్‌టెక్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు సభ్యదేశాలుగా ఉన్నారుు. 2014లో మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు.

  ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఘూటింగ్‌లో రెండు స్వర్ణాలు

  అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు లభించాయి. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరగుతున్న ఈ టోర్నిలో సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ స్వర్ణ పతకాలను సాధించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా… రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించారు.

  విశాఖ లో సి హరియర్ మ్యూజియం

  సాగర తీరంలో మరో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సి హరియర్ ఎయిర్ క్రాఫ్ట్ విశాఖకి చేరుకుంది. మరో 6 నెలల్లో సి హరియర్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. ఈ యుద్ధ విమానం భారత నౌకాదళంలో ఏవియేషన్ విభాగంలో దేశానికి 32 సంవత్సరాల పాటు సేవలను అందించింది. 2016లో సేవల నుంచి సి హరియర్ ఎయిర్ క్రాఫ్ట్ నిష్క్రమించింది.