29 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  9

  *జాతీయ పాల దినోత్సవం : నవంబర్ 26
  *మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకావిష్కరణ
  *భారతీయ అవయవ దాన దినోత్సవం: నవంబర్ 27.
  *విజయవాడ ఎన్ఐడీ డైరెక్టర్ గా శేఖర్ ముఖర్జీ

  *జాతీయ పాల దినోత్సవం : నవంబర్ 26
       నవంబర్ 26 న జాతీయ పాలు దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశపు అత్యంత విజయవంతమైన పాడి పరిశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ వర్ఘీస్ కురియన్ జన్మ దినోత్సవం సందర్భంగా, పాడి పరిశ్రమ సంస్థ అమూల్ స్థాపకుడు.
  ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతదేశం.

  *మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తకావిష్కరణ
       మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా, ట్రాన్స్ఫార్మేషన్ అండర్ మోదీ గవర్నమెంట్’ పుస్తకంను న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అందజేశారు. విద్య, ప్రజా వైద్యం, తదితర అంశాలపై మొత్తం 51 వ్యాసాలు ఉన్న ఈ పుస్తకాన్ని ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రాయ్, కిశోర్ దేశాయ్, అనిర్బన్ గంగూలీ రచించారు.

  *భారతీయ అవయవ దాన దినోత్సవం: నవంబర్ 27.
       ఢిల్లీలో National Organ and Tissue Transplant Organization (NOTTO) 9 వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే నిర్వహించింది.
  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి – శ్రీ అశ్వినీ కుమార్ చౌబే.
  అత్యుత్తమ ప్రదర్శన రాష్ట్రంగా – తమిళనాడు.
  అవయవ దాన అవగాహనను ప్రోత్సహించినందుకు ఉత్తమ రాష్ట్రంగా మహారాష్ట్ర అవార్డును అందుకుంది.
  డాక్టర్ సుబ్రమణ్య అయ్యర్ కె, కొచ్చి దేశంలో మొట్టమొదటి చేతి మార్పిడిని నిర్వహించినందుకు సన్మానించారు.
  ఇండియాలో మొదటి Uterine Transplant – Dr. Shailesh Puntambekar, Pune.

  *విజయవాడ ఎన్ఐడీ డైరెక్టర్ గా శేఖర్ ముఖర్జీ
      విజయవాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) డైరెక్టర్ గా శేఖర్ ముఖర్జీని కేంద్ర క్యాబినెట్ కమిటీ నియమించింది.