29 కరెంట్ అఫైర్స్ 2019

  0
  13

  # సీసీఎంబీలో కణ పరిశోధన కేంద్రం ఏర్పాటు
  # అంగారకుడిపై కంపనాలు
  # చరిత్రలో మొట్టమొదటి సారి నిబంధనలను పక్కకు పెట్టి నూతన నిర్ణయం తీసుకున్న యూఏఈ

  సీసీఎంబీలో కణ పరిశోధన కేంద్రం ఏర్పాటు

  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఏప్రిల్ 25న కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది.

  కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం రూ.4.5 కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కణాధారిత మాంసం అభివృద్ధిపై జాతీయ మాంసం పరిశోధన సంస్థ, హ్యూమనీ సొసైటీతో కలిసి సీసీఎంబీ పరిశోధనలు చేస్తోందని వివరించారు. ఈ మేరకు సీసీఎంబీ, హ్యూమనీ సొసైటీ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.

  అంగారకుడిపై కంపనాలు

  అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి.

  మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్ ఎక్స్‌పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్‌ఈఐఎస్) పరికరం ఏప్రిల్ 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. 2018, మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్‌లో సిసిమోమీటర్‌ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది.

  చరిత్రలో మొట్టమొదటి సారి నిబంధనలను పక్కకు పెట్టి నూతన నిర్ణయం తీసుకున్న యూఏఈ

  యూఏఈ వివాహ నిబంధనల ప్రకారం ఇస్లాం మతానికి చెందిన పురుషుడు.. ఇతర మతాలకు చెందిన మహిళను పెళ్లాడవచ్చు. కానీ, ఇస్లాం మతానికి చెందిన మహిళ మాత్రం ఇతర మతాలకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోకూడదు.

  ఆ దేశం 2019వ ఏడాదిని ‘సహన సంవత్సరాది’గా ప్రకటించింది.

  దీంతో నిబంధనలను పక్కకు పెట్టి యూఏఈ చరిత్రలో మొట్టమొదటి సారి హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన పాపకు ఆ దేశ ప్రభుత్వం జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది.

  తొమ్మిది నెలల వయసులో ఆ పాప ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంది.

  ఆ పాపకు అనాంత ఏస్‌లీన్‌ కిరణ్‌ అని పేరు పెట్టారు.