29 అక్టోబర్ కరెంట్ అఫైర్స్

  0
  12

  *దేశంలో తొలిసారిగా తయారుచేసిన ‘శక్తి’ మైక్రోప్రాసెసర్
  *ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు.
  *ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ కు ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్
  *నవతెలంగాణ పత్రిక కార్టూన్ ఎడిటర్ నరసింహకు ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు
  *తెలంగాణ పర్యాటక శాఖ ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు
  *తెలంగాణ ఆయిల్ఫెడ్ కు ప్రతిష్టాత్మక ఆగ్రో వరల్డ్-2018 అవార్డు
  *ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్

  *దేశంలో తొలిసారిగా తయారుచేసిన ‘శక్తి’ మైక్రోప్రాసెసర్
      చండీగఢ్‌లోని ఇస్రో సెమీ-కండక్టర్ ల్యాబ్‌లో శక్తి ని తయారు చేశారు. రక్షణ, అణు శక్తి రంగాలతో పాటు ప్రభుత్వ సంస్థలకు ఈ మైక్రోప్రాసెసర్ ఉపయోగపడుతుంది. 

  *ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా  మార్చారు.

      ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘలు చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా-యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు, పరిసర ప్రాంతానికి కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు.

  *ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ కు  ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్ 

     ఈ మేరకు న్యూఢిల్లీలో అక్టోబర్ 26న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను స్వామినాథన్ కు ఈ అవార్డు దక్కింది.ఐసీఎఫ్‌ఏ ప్రకటించిన అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ గుర్తింపు పొందారు. అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని ఆయనకు అందజేశారు. 

  *నవతెలంగాణ పత్రిక కార్టూన్ ఎడిటర్ నరసింహకు ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు

     దేశవ్యాప్తంగా పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(PCI) ఉత్తమ కార్టూనిస్ట్ గా పున్న నరసింహన్ ను ఎంపిక చేసింది.

  *తెలంగాణ పర్యాటక శాఖ  ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు.

      యూరప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 27న రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ… హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా త్వరలో నిర్వాహకుల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుందని చెప్పారు.

   *తెలంగాణ ఆయిల్ఫెడ్ కు  ఇఫ్కా-భారత వ్యవసాయ పరిశోధన సంస్థ  ప్రతిష్టాత్మక ఆగ్రో వరల్డ్-2018 అవార్డు.

      ఢిల్లీలో అక్టోబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. నూనె దిగుబడి పెరగడంలో కృషి చేసినందకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్రంలో సగటున 18.84 శాతం నూనె దిగుబడి వస్తోంది.

  *ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్.

      పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఐజేయూ 9వ జాతీయ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు ఎస్.ఎన్ సిన్హా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీకి చెందిన సబినా ఇంద్రజిత్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు.