28 ఆగష్టు కరెంట్ అఫైర్స్ 2019

  0
  4

  # రూపాయికే సువిధా న్యాప్కిన్
  # సైకాలజిస్ట్ లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు
  # సైకాలజిస్ట్ లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు

  రూపాయికే సువిధా న్యాప్కిన్

  మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్కిన్‌లను రూపాయికే అందజేయనున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ ఆగస్టు 26న వెల్లడించారు. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర 10 రూపాయలకు లభించేది. ఇకపై అది రూ. 4కే లభించనుంది. కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్‌లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్ పేరుతో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా 5,500 జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి.

  సైకాలజిస్ట్ లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు

  ప్రముఖ మానసిక శిక్షణ నిపుణుడు డా.పి.లక్ష్మణ్‌కు ఇన్‌స్పిరేషనల్ లీడర్ అవార్డు లభించింది. ఢిల్లీలో ఆగస్టు 24న జరిగిన ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్జెంటీనా రాయబారి డెనియల్ చుబురు చేతుల మీదుగా లక్ష్మణ్ అవార్డు అందుకున్నారు. లక్ష్మణ్ సేవలకు గుర్తింపుగా సామాజిక సేవా విభాగంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది.

  నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల్ మండలం ఎన్‌సీ తాండకు చెందిన లక్ష్మణ్ గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సైకాలజీ కౌన్సెలింగ్, మానసిక శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుసార్లు ఉత్తమ సామాజిక సేవా విభాగంలో అవార్డులు ప్రకటించింది.