27 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  11

  * దిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్
  * నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌కు నీలిఫలకం పురస్కారం
  * ఆగిరిపల్లిలో నిఘా శిక్షణ అకాడమీ
  * ప్రధాని మోదీ చివరి ‘మన్‌ కీ బాత్‌’

  దిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

  ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ దగ్గర్లో నేషనల్ వార్ మెమోరియల్ ను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదిలిన దాదాపు 26వేల మంది సైనికులకు గుర్తుగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా దీని నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. విధుల్లో భాగంగా మరణించిన 25,942 మంది సైనికుల పేర్లను ఈ మెమోరియల్‌ వద్ద 16 గ్రానైట్ ఫలకలపై చెక్కించారు.

  నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌కు నీలిఫలకం పురస్కారం

  రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ తరఫున గూఢచారిగా పనిచేసిన భారత సంతతి సాహసి నూర్‌ ఇనాయత్‌ఖాన్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది.
  ఆమెను ప్రతిష్ఠాత్మక ‘నీలిఫలకం’తో గౌరవించాలని సంబంధిత కార్యక్రమం ప్రతినిధులు నిర్ణయించారు. భారత సంతతి యువతికి ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం లభించడం ఇదే ప్రథమం.

  ఆగిరిపల్లిలో నిఘా శిక్షణ అకాడమీ

  సమీకృత నిఘా శిక్షణా సంస్థను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఆగిరిపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నిఘా విభాగానికి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున ధర వసూలు చేయాలని నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో 16.5 ఎకరాల భూమి బస్‌స్టేషన్‌ కోసం కేటాయింపు. అదే జిల్లా శంఖవరం రామన్నపాలెంలో 18.48 ఎకరాల కొండపోరంబోకు ఏపీఐఐసీకి అప్పగింత.

  ప్రధాని మోదీ చివరి ‘మన్‌ కీ బాత్‌’

  ప్రతి నెలా చివరి ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతాడు .ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న ఆయన ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే తన చివరి మన్‌కీ బాత్‌ కార్యక్రమమని చెప్పారు.
  ఎన్నికలు ఉండటంతో మళ్లీ మే నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానని చెప్పి లోక్‌ సభ ఎన్నికల్లో విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.