27 అక్టోబర్ కరెంట్ అఫైర్స్

  0
  11

  *గ్రీకు దీవిని వణికించిన భూకంపం
  *కేశవులుకు గ్లోబల్ సీఈఓ పురస్కారం
  *తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి
  *ఇండియా CAPAM అవార్డు 2018 ను గెలుచుకుంది.
  *లక్నోలో ‘కృషి కుంభ్’
  *ఈడీ చీఫ్ సంజయ్ మిశ్రా
  *అమెరికా ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్(ఎఫ్ఈఆర్సీ) ఛైర్మన్ భారతీయ సంతతికి చెందిన నెయిల్ ఛటర్జీ .

  *గ్రీకు దీవిని వణికించిన భూకంపం

    గ్రీస్ లోని  పర్యాటక దీవి జకింథోస్ లో 2018 అక్టోబర్ 26న శక్తిమంతమైన భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.

   

  *కేశవులుకు గ్లోబల్ సీఈఓ పురస్కారం

    భారత ఆహార, వ్యవసాయ మండలి(ICFA) గ్లోబల్‌ సీఈఓ ఉత్తమ పురస్కారానికి తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు కె.కేశవులు ఎంపికయ్యారు. డిల్లీలో 2018 అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో భూటాన్‌ ప్రధాని లియాన్సో నుంచి ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ నుంచి విత్తనాల ఎగుమతి, ఆన్‌లైన్‌లో విత్తన ధ్రువీకరణ వంటి విధానాల అమలుకు చేసిన కృషికి కేశవులుకు ఈ పురస్కారం దక్కింది.

   

  *తీపి జొన్నతో ఇథనాల్ ఉత్పత్తి

      తీపి జొన్న నుంచి ఇథనాల్‌ వంటి జీవ ఇంధనం ఉత్పత్తికి ఎన్నో అవకాశాలున్నాయని భారత తృణ ధాన్యాల పరిశోధన కేంద్రం(ఐఐఎంఆర్‌) ఇన్‌ఛార్జి సంచాలకుడు ఎస్‌.ఎస్‌.రావు వెల్లడించారు.  రాజేంద్రనగర్‌లోని ఐఐఎంఆర్‌లో జీవ ఇంధనాల ఉత్పత్తిపై 2018 అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.  

   

  *ఇండియా CAPAM అవార్డు 2018 ను గెలుచుకుంది.

    

  భారతదేశం కామన్వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ (CAPAM) అవార్డు, 2018 గెలుచుకుంది.
  అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మరియు పబ్లిక్ ఫిర్యాదుల విభాగం (DARPG), పర్సనల్, పబ్లిక్ ఫిర్యాదుల మరియు పెన్షన్స్ మంత్రిత్వ శాఖ CAPAM యొక్క సంస్థాగత సభ్యత్వం కలిగి ఉంది.
  గయానాలోని జార్జిటౌన్లో నిర్వహించిన వార్షిక జనరల్ సభ్యుల సమావేశంలో అవార్డులు ప్రకటించబడ్డాయి. 

   

  *లక్నోలో ‘కృషి కుంభ్

    ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో 2018 అక్టోబర్ 26న ‘కృషి కుంభ్’ ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ‘కృషి కుంభ్’లో  రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, పరిశోధన సంస్థలు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు. ‘కృషి కుంభ్’ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘విత్తనం నుంచి విపణి’ (బీజ్ టు బజార్)దాకా రైతుల కోసం, వారి ఉత్పత్తుల కోసం అత్యంత పటిష్ఠమైన మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

   

  *ఈడీ చీఫ్  సంజయ్ మిశ్రా

    దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నూతన డైరెక్టర్ గా ఐటీ అధికారి సంజయ్ కుమార్ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 1984వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన మిశ్రాను ఈడీ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్ గా నియమించింది. దీంతో పాటు మూడు నెలల పాలు ఈడీ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
  ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కర్నల్ సింగ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. అయితే ఈడీ డైరెక్టర్ గా కర్నల్ సింగ్ మరికొంత కాలం పొడగించేందుకు కేంద్రం విముఖత చూపించింది. దీంతో మిశ్రాకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మిశ్రా దిల్లీలోని ఆదాయపు శాఖలో చీఫ్ కమిషనర్ గా ఉన్నారు.

   

  *అమెరికా ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్(ఎఫ్ఈఆర్సీ) ఛైర్మన్  భారతీయ సంతతికి చెందిన నెయిల్ ఛటర్జీ 

    ఈ మేరకు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు.  పస్తుతం ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా ఉన్న కెవిన్ మేక్ ఇంటైర్ అనారోగ్యం కార‌ణంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అమెరికా పవర్ గ్రిడ్, వేలకోట్ల డాలర్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఎఫ్‌ఈఆర్‌సీ పరిధిలోకి వస్తాయి. ఛటర్జీ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించడం ఇది రెండోసారి. గతంలో మెక్ ఇంటైర్ ఎఫ్‌ఈఆర్‌సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించకముందు 2017 ఆగస్టు 10 నుంచి డిసెంబర్ 7 వరకు ఛటర్జీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.