26 మే కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  # ఎస్పీడీసీఎల్‌కు ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీస్‌’ అవార్డు
  # ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం ఇదే!
  # గైడెడ్‌ బాంబు పరీక్ష విజయవంతం
  # ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌

  ఎస్పీడీసీఎల్‌కు ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీస్‌’ అవార్డు

  పైకప్పులపై సౌరవిద్యుత్తు పరికరాల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నందుకు గాను సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ తెలంగాణ లిమిటెడ్‌(టీఎ్‌సఎస్పీడీసీఎల్‌)కు ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీస్‌’ కేటగిరిలో పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధుల నుంచి ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి అవార్డును అందుకున్నారు.

  ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం ఇదే!

   స్విస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నోవట్రీస్‌ తయారు చేసిన జీన్‌ థెరపీ ఔషధం జొలెన్స్‌స్మాకు అమెరికా ఆమోదం లభించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ)ఈ మేరకు అనుమతులు ఇచ్చింది. చిన్నారుల్లో వచ్చే అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్‌ మస్కలర్‌ ఆట్రోఫీ. ప్రతి 10వేల మందిలో ఒకరికి చాలా అరుదుగా ఈ వ్యాధి వస్తుంటుంది. ఇలాంటి సమస్యతో పుట్టిన చిన్నారుల వెంటనే చనిపోతారు.

  లేదా రెండేళ్లు వచ్చే వరకూ వీరు కృత్రిమ శ్వాస మీద బతకాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్లు చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం జీన్‌ థెరపీ విధానంలో ఈ ఔషధాన్ని వాడుతూ వ్యాధి నియంత్రణ చేస్తారు. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా 2.1మిలియన్‌ డాలర్లు. ఔషధ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డ్రగ్‌గా నిలిచింది.

  గైడెడ్‌ బాంబు పరీక్ష విజయవంతం

  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మే 24న గైడెడ్‌ బాంబును విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా తయారు చేసిన ఈ 500 కేజీల ఇనెర్షియల్‌ గైడెడ్‌ బాంబును వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. చాలా కచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ పరీక్ష జరిగింది.

  ఈ ప్రయోగానికి హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ ల్యాబ్‌ ‘రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌’ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌ ఎస్‌. ప్రహ్లాదరావు నాయకత్వం వహించారు.

  ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌

  ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్‌. ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది.  థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది.

  ఫీచర్స్ ::

  13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి.