26 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  * యుద్ధ విమానాల తయారీ విజయవంతం
  * చంద్రయాన్‌-2లో నాసా లేజర్‌ పరికరాలు
  * కనీస ఆదాయ పథకంతో ద్రవ్య క్రమశిక్షణకు దెబ్బ

  యుద్ధ విమానాల తయారీ విజయవంతం

  భారత వాయుదళానికి యుద్ధ విమానాలను హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) విజయవంతంగా తయారుచేసింది. 16వ విడతగా ఆ విమానాలను వాయుసేనకు అందించేందుకు ఒప్పందాలు చేసుకొన్నట్లు హెచ్‌ఏఎల్‌ అధికారులు గుర్తుచేశారు. గడువులోగానే వీటికి రూపమిచ్చామని అధ్యక్షుడు మాధవన్‌ 16 ఫైటర్లు, 8 విమానాలు శిక్షణ కోసం తయారుచేశామన్నారు.

  చంద్రయాన్‌-2లో నాసా లేజర్‌ పరికరాలు

  చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించబోయే చంద్రయాన్‌-2 వ్యోమనౌకలో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన లేజర్‌ పరికరాలు ఉంటాయి. జాబిల్లి భూమికి ఎంత దూరంలో ఉందన్నది అత్యంత కచ్చితత్వంతో నిర్ధరించడానికి అవి సాయపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుడిపై దిగబోయే ఇజ్రాయెల్‌ ల్యాండర్‌ ‘బెరెషీట్‌’లోనూ నాసాకు చెందిన లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌ ఫలకాలు ఉంటాయని చెప్పారు.
  ‘‘చందమామ ఉపరితలంపై సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో రిఫ్లెక్టర్‌ ఫలకాలను ఉంచాలని భావిస్తున్నట్లు నాసాలోని ప్లానెటరీ సైన్స్‌ డివిజన్‌ తాత్కాలిక డైరెక్టర్‌ లోరీ గ్లేజ్‌ చెప్పారు.
  *రెట్రోరెఫ్లెక్టర్లు అనేవి అధునాతన దర్పణాలు. అవి భూమి నుంచి పంపే లేజర్‌ కాంతి సంకేతాలను పరావర్తనం చెందిస్తాయి. చంద్రుడిపై సదరు ల్యాండర్‌ ఎక్కడ ఉందన్నది అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ఈ సంకేతాలు వీలు కల్పిస్తాయి. దీని ఆధారంగా చంద్రుడు-భూమి మధ్య దూరాన్ని నిర్దిష్టంగా తేల్చవచ్చు. ఇప్పటికే జాబిల్లిపై ఇలాంటి పరికరాలు ఐదు వరకూ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని లోపాలున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

  కనీస ఆదాయ పథకంతో ద్రవ్య క్రమశిక్షణకు దెబ్బ

  అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.72 వేల ఆదాయాన్ని అందిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ తప్పుపట్టారు. ఇది పని సంస్కృతికి వ్యతిరేకమని, ద్రవ్య క్రమశిక్షణను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో నెగ్గేందుకు చందమామను తెచ్చిస్తానని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటే. అందులో భాగంగానే రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఈ పథకాన్ని ప్రకటించారు. అది ఎప్పటికీ అమలుకాదు. ఈ పథకానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం, బడ్జెట్‌లో 13 శాతం నిధులు అవసరమవుతుందనుకున్నా ప్రజల వాస్తవ అవసరాలు అపరిష్కృతంగానే ఉండిపోతాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.