26 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  8

  *నటుడు రాజేంద్రప్రసాద్ కు డిల్లీ తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం
  *డేవిస్ కప్ విజేత క్రొయేషియా
  *బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఆమోదం

  *నటుడు రాజేంద్రప్రసాద్ కు డిల్లీ తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారం
     డిల్లీ తెలుగు అకాడమీ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. నటుడు అలీకి ప్రతిభా భారతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. డిల్లీ తెలుగు అకాడమీ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని అకాడమీ 2018 నవంబర్ 25న సత్కరించింది.

  *డేవిస్ కప్ విజేత క్రొయేషియా
     క్రొయేషియా జట్టు డేవిస్ కప్ టైటిల్ ను గెలుచుకుంది. 2018 నవంబర్ 25న ఫ్రాన్స్ లో జరిగిన ఫైనల్లో క్రొయేషియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను ఓడించింది. క్రొయేషియాకు ఇది రెండో డేవిస్ కప్ టైటిల్. సంప్రదాయ ఫార్మాట్లో జరిగిన చివరి డేవిస్ కప్ ఇది. 2019 నుంచి కొత్త ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది.

  *బ్రెగ్జిట్ ఒప్పందానికి ఈయూ ఆమోదం
     బ్రెగ్జిట్ ఒప్పందానికి ఐరోపా యూనియన్(ఈయూ) నేతలు 2018 నవంబర్ 25న ఆమోదం తెలిపారు. దీంతో 28 దేశాల ఈయూ ఆర్థిక కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు మార్గం సులగమమైంది.
  • లండన్లో జరిగిన సమావేశంలో మిగిలిన 27 దేశాల నేతలు వివాదాస్పద బ్రెగ్జిట్ ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేశారు. బ్రిటన్ ఉపసంహరణ ఒప్పందం, భవిష్యత్తు, ఈయూ-యూకే సంబంధాలపై రాజకీయ ప్రకటనకు ఈయూ-27 ఆమోదం తెలిపినట్లు ఐరోపా మండలి అధ్యక్షులు డొనాల్డ్ టస్క్ ట్వీట్ చేశారు.
  • స్పెయిన్ తీరంలో ఉండే బ్రిటన్ విదేశీ భూభాగం జిబ్ట్రార్ విషయంలో స్పెయిన్ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా తర్వాత ఉపసంహరించుకోవడంతో అడ్డంకి లేకుండా పోయింది. ఎలాంటి ఓటింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు.