26 జూన్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  # బ్లాక్ ఫారెస్ట్ కప్‌లో భారత్‌కు ఏడు పతకాలు
  # ప్లాస్టిక్ రహిత పట్టణంగా తిరువనంతపురం (కేరళ)
  # ఏపీ పోలీసు శాఖకు విదేశాంగ శాఖ అవార్డు

  బ్లాక్ ఫారెస్ట్ కప్‌లో భారత్‌కు ఏడు పతకాలు

  జర్మనీలోని విల్లింగెన్-చెన్నిన్‌గెన్‌లో జరిగిన బ్లాక్ ఫారెస్ట్ కప్ టోర్నమెంట్‌లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు ఏడు పతకాలు సాధించి టోర్నమెంట్‌లో ఉత్తమ జట్టు అవార్డును సొంతం చేసుకున్నారు.

  భారత్ నెగ్గిన ఏడు పతకాల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, లాత్వియా, హంగేరి, లిథువేనియా, మంగోలియా, గ్రీస్, పోలాండ్ దేశాలు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ తరఫున 13 మంది బాక్సర్లు బరిలోకి దిగారు. భారత్ తరఫున తమన్నా (48 కేజీలు), అంజు (50 కేజీలు), నేహా (54 కేజీలు), అంబేషోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. ఫైనల్లో ఓడిన తన్ను (52 కేజీలు), ఆశ్రేయ (63 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

  ప్లాస్టిక్ రహిత పట్టణంగా తిరువనంతపురం (కేరళ)

  తమిళనాడు లోని హిల్ స్టేషన్ అయినా ఊటీలో 2019 ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ లో తొలి ప్లాస్టిక్ రహిత పట్టణం తిరువనంతపురం (కేరళ)

  ఏపీ పోలీసు శాఖకు విదేశాంగ శాఖ అవార్డు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవార్డు లభించింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ 2019లో భాగంగా జూన్ 24న ఢిల్లీలో నిర్వహించిన పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందజేశారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్ నుంచి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఆర్.జయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తరఫున అవార్డును అందుకున్నారు. పాస్‌పోర్టుల జారీ అంశంలో త్వరితగతిన పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగానికి పురస్కారం లభించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పోలీసు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిన ఏపీ నిఘా విభాగం 2018-19 సంవత్సరానికి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.