26 ఏప్రిల్ క్రీడా ముఖ్యాంశాలు

  0
  7

  షూటింగ్‌ ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్ కు రెండు స్వర్ణాలు

  ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 2 స్వర్ణాలు

  ఆసియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత బాక్సర్ అమిత్‌ పంఘాల్ స్వర్ణ పతకం సాధించాడు. 52 కేజీల విభాగంలో కొరియన్‌ ఆటగాడు కిమ్‌ ఇంక్యూను ఓడించి స్వర్ణ పతకం గెలిచాడు.

  56 కేజీల విభాగంలో కవిందర్‌ సింగ్‌ బిస్త్‌ స్వర్ణం సాధించారు. ఎంఖ్‌-అమర్‌ ఖఖూ (మంగోలియన్‌)ను కవిందర్‌ సింగ్‌ బిస్త్‌ అద్భుతమైన ప్రదర్శనతో 3-2తో ఓడించాడు.

  షూటింగ్‌ ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్ కు రెండు స్వర్ణాలు

  షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్లు మిక్స్‌డ్‌ విభాగంలో రెండు స్వర్ణాలుగెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్‌, సౌరభ్‌ చౌదరి జోడీ పసిడి సాధించగా, ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దివ్యాంశ్‌ పన్వర్‌, అంజుమ్‌ మౌద్గిల్‌ జంట స్వర్ణం ఖాతాలో వేసుకుంది.

  ఆసియా రెజ్లింగ్‌ రెండో రోజు భారత్ కు ఐదు పతకాలు

  ఆసియా రెజ్లింగ్‌ రెండో రోజు జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు దక్కాయి. ఇందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ 74 కిలోల విభాగం ఫైనల్లో అమిత్‌ ధన్‌కార్‌ 0-5 స్కోరు తేడాతో కజకిస్థాన్‌ రెజ్లర్‌ దనియార్‌ కైసనోవ్‌ చేతిలో ఓటమిపాలై రజత పతకం గేలిదాడు.

  92 కిలోల విభాగం టైటిల్‌ఫైట్‌లో విక్కీ 0-11తో ఇరాన్‌ కుస్తీవీరుడు అలీరెజా మహ్మద్‌ కరిమిమాచియానీ చేతిలో ఓడి రజతానికి పరిమితమయ్యాడు. మిగతా భారత రెజ్లర్లలో రాహుల్‌ అవారే (61 కి), దీపక్‌ పూనియా (86 కి), సుమిత్‌ (125 కి)లకు కాంస్యాలు లభించాయి. రాహుల్‌ 9-2తో జిన్‌చియోల్‌ కిమ్‌ (కొరియా)పై, దీపక్‌ 8-2తో బఖోదుర్‌ కొదిరోవ్‌పై, సుమిత్‌ 8-2తో ఫర్కోద్‌ అనకులోవ్‌ (తజకిస్థాన్‌)పై గెలిచి కాంస్యం సాధించారు. దీంతో ఈ టోర్నీలో భారత్‌ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది.