26 అక్టోబర్ కరెంట్ అఫైర్స్

  0
  28

  1. TECH 2018, UNESCO MGIEP మరియు AP ప్రభుత్వం నిర్వహించనున్నాయి.
  2. 10 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడు విరాట్.
  3. గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ సమ్మిట్ 2018 – న్యూఢిల్లీలో
  4. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కొ కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది.
  5. భారత్-చైనా సరిహద్దు వెంబడి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే లైను
  6. ప్రొఫెసర్ అప్పారావుకు కె.సి.మెహతా స్మారక అవార్డు
  7. టైమ్ మ్యాగజీన్ జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు

  *TECH 2018,  UNESCO MGIEP మరియు AP ప్రభుత్వం నిర్వహించనున్నాయి.

    UNESCO MGIEP (మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో TECH 2018 ను ప్రకటించింది, ఇది ఒక అంతర్జాతీయ సమావేశం, ఇది “ట్రాన్స్మిస్వ్వ్ పెడిగోగిస్” నుండి “ట్రాన్స్ఫార్మినేటివ్ పెడగోగిస్” కు మార్చడానికి “ఆటలు మరియు డిజిటల్ లెర్నింగ్” శాంతియుత మరియు స్థిరమైన సమాజాలు.
  మూడు రోజుల కార్యక్రమాన్ని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, వైజాగ్ సిటీలో నవంబర్ 15-17 నిర్వహించనున్నారు

  *10 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న ఆటగాడు విరాట్. 

    కోహ్లీ 205 ఇన్నింగ్స్ లోని 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడు విరాట్. సచిన్ 259 ఇన్నింగ్స్ లో నెలకొల్పిన రికార్డు బద్దలయింది.
  ఒక ఏడాదిలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అతను కేవలం 11 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. వరుసగా మూడేళ్ళు 1000 పరుగులు చేసిన తొలి కెప్టెన్ గాను రికార్డు సృష్టించాడు.
  వన్డేలో కోహ్లీ 37వ శతకాన్ని అందుకున్నాడు. వన్డే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన సచిన్(49).

   

  * గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ సమ్మిట్ 2018 –  న్యూఢిల్లీలో 

    న్యూఢిల్లీలో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ సమ్మిట్ 2018 జరుగుతున్నది. ఈ మీటింగ్ లో వివిధ దేశాల కు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయక నిపుణులు పాలుపంచుకోనున్నారు. ప్రస్తుత భారత వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ కార్యక్రమమునకు అధ్యక్షత వహించారు.

   

  *ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కోకు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు లభించింది.

    కార్పొరేట్‌ గవర్నెన్స్‌, సుస్థిరతపై లండన్‌లో నిర్వహించిన 18వ అంతర్జాతీయ సదస్సులో 2018 అక్టోబర్‌ 25న ఈ పురస్కారాన్ని ట్రాన్స్‌కో జేఏండీ దినేశ్‌ పరుచూరి స్వీకరించారు.

   

  *భారత్-చైనా సరిహద్దు వెంబడి సముద్ర మట్టానికి 5,360 మీటర్ల పైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే మార్గాన్ని భారత రైల్వే నిర్మించనుంది.
  • దీనికి సంబంధించిన మొదటి సర్వే పూర్తయింది. ఈ రైల్వే లైనును వ్యూహాత్మకంగా బిలాస్పూర్-మనాలి-లేహను కలుపుతూ నిర్మించనున్నారు.
  • దీని నిర్మాణం పూర్తయితే డిల్లీ-లేహ్ మధ్య ప్రయాణ సమయం 40 గంటల నుంచి 20 గంటలకు తగ్గనుంది.
  • రైల్వే లైను మొత్తం పొడవు 465 కిలోమీటర్లు, అంచనా వ్యయం 83,360 కోట్ల రూపాయాలు. దీన్ని సముద్ర మట్టానికి 5,360 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. రైల్వే లైను సగం కంటే ఎక్కువ అంటే 244 కిలోమీటర్ల దూరం టన్నెళ్లలోనే ఉంటుంది. అతి పెద్ద టన్నెల్ పొడవు 27 కిలోమీటర్లు ఉంటుంది.

   

  * హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.అప్పారావు కె.సి.మెహతా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. డిల్లీలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌(ఎన్‌ఏఏఎస్‌) 2017-2018 సంవత్సరానికి ఈ అవార్డును ప్రకటించింది.

  • పంట సంరక్షణకు సంబంధించి అప్పారావు చేసిన పరిశోధనలకుగాను ఈ సత్కారానికి ఎంపికయ్యారు. పంటల్లో వచ్చే శిలీంధ్ర సంబంధ తెగుళ్లను నియంత్రించే విధానంపై ఆయన చేసిన పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
  • ముఖ్యంగా వేరుసెనగ పంటలో టిక్కా తెగులు నియంత్రణకు ఎంతో దోహదం చేశాయి. వృక్షశాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకోనున్నారు.

   

  * అమెరికా ఆరోగ్య రక్షణ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేసిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు స్థానం దక్కించుకున్నారు.
  • టైమ్ మ్యాగజీన్ దీనిని రూపొందించింది. ఈ జాబితాలో దివ్యా నాగ్, డాక్టర్ రాజ్ పంజాబీ, అతుల్ గవాండే ఉన్నారు.
  • దివ్యానాగ్ వైద్యులు, పరిశోధకులకు ఉపయోగపడేలా యాపిల్ వాచ్ సీరీస్-4లో యాప్ ను సిద్ధం చేశారు.
  • రాజ్ పంజాబీ వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు శిక్షణను అందించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు.
  • గవాండే పారదర్శకంగా, తక్కువ వ్యయంతో కార్పొరేట్ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేశారు.