25 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  # జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడిగా బాలరాజు
  # బీఎఫ్‌ఐ సాంకేతిక కమిషన్‌ ఛైర్మన్‌గా నార్మన్‌
  # తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ
  # భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

  జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడిగా బాలరాజు

  రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడిగా ఎం.బాలరాజు ఎన్నికయ్యాడు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా విజయ్‌పాల్‌ రెడ్డి, కోశాధికారిగా ప్రశాంత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులుగా అనంత్‌ రావు, డేవిడ్‌, సంయుక్త కార్యదర్శులుగా సుబ్బారాయుడు, నవీన్‌, సింధు ఎన్నికయ్యారు.

  బీఎఫ్‌ఐ సాంకేతిక కమిషన్‌ ఛైర్మన్‌గా నార్మన్‌

  భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) సాంకేతిక కమిషన్‌ ఛైర్మన్‌గా నార్మన్‌ ఐజాక్‌ (తెలంగాణ) ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన బీఎఫ్‌ఐ సర్వ సభ్య సమావేశంలో ఛైర్మన్‌ పదవికి నార్మన్‌ను సిఫార్సు చేశారు. 2023 వరకు నార్మన్‌ ఈ పదవిలో కొనసాగుతాడు. ప్రపంచ బాస్కెట్‌బాల్‌ సమాఖ్య (ఫిబా) టెక్నికల్‌ డెలిగేట్‌గా భారత్‌ నుంచి నార్మన్‌ ఒక్కడే ఉన్నాడు. తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ

  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 6 లేదా అంతకుముందుగా కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో న్యాయశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బదిలీకి ఆమోద ముద్ర వేసినట్లు న్యాయశాఖ వివరించింది.

  భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

  అంతర్జాతీయ స్పీడ్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారులు ముగ్గురికి చోటు దక్కింది.  రఘు, మెషక్, కరుణాకర్‌ ఆయా వయోవిభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు అండర్‌–14 జట్టుకు ఎంపికైన రఘు.. కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు.భారత అండర్‌–19 బాలుర జట్టుకు మెషక్, అండర్‌–17 బాలుర జట్టులో కరుణాకర్‌ చోటు దక్కించుకున్నారు.