25 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  10

  *దేహ్రాదూన్ విమానాశ్రయానికి వాజ్ పేయీ పేరు
  *కోనాలో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయం
  *వరద అంచనాకు కొత్త టెక్నాలజీ
  *అజీమ్ ప్రేమ్ జీ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2018 పొందాడు.
  *‘ఇన్స్పైర్’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కు 2వ స్థానం

  *దేహ్రాదూన్ విమానాశ్రయానికి వాజ్ పేయీ పేరు

     ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్ విమానాశ్రయానికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది.

  *కోనాలో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయం

     తూర్పు గోదావరి జిల్లాలోని కోనా గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ వాణిజ్య నౌకాశ్రయంను అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ గేట్వే పోర్ట్ (కేజీపీఎల్) తెలిపింది.
  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు నవంబర్ 21న వెల్లడించింది. కేఎస్ఈజెడ్కు చెందిన 1,811 ఎకరాల్లో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ.2,123 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పోర్ట్లో సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సూమారు 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేజీపీఎల్ పేర్కొంది. కాకినాడ సెజ్ లిమిటెడ్ (కేఎస్ఈజెడ్)కు అనుబంధ సంస్థగా కేజీపీఎల్ పనిచేస్తుంది.

  *వరద అంచనాకు కొత్త టెక్నాలజీ

     వర్షంతో పాటు వరద ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ‘ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్క్యాస్టింగ్ అప్రోచ్’ అనే కొత్త టెక్నాలజీని భారత వాతావరణశాఖ(ఐఎండి) అభివృద్ధి చేసింది.
  ఈ మేరకు ఐఎండీ చీఫ్ కె.జె.రాజేశ్ నవంబర్ 23న తెలిపారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వర్షాలు కురిసినప్పుడు నదులు, రిజర్వాయర్లలో పెరిగే నీటి పరిమాణాన్ని కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. దీంతో సహాయక చర్యలతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.

  మరోవైపు సముద్రాల్లో వేడిగా ఉండే ప్రాంతాలను గుర్తించేందుకు, తుపాన్ల కదిలికల్ని అర్థం చేసుకునేందుకు మరో సాంకేతికతను కూడా ఐఎండి అభివృద్ధి చేసింది.

  *అజీమ్ ప్రేమ్ జీ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2018 పొందాడు.

     విప్రో చైర్మన్ : అజీమ్ ప్రేమ్ జీ (భారతదేశంలో రెండవ అతి పెద్ద ధనవంతుడు).
  భారతదేశంలో 4వ అతిపెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీ: విప్రో.
  ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ కార్యక్రమం ముంబైలో జరిగింది.

  *‘ఇన్స్పైర్’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కు 2వ స్థానం

  దేశవ్యాప్తంగా ‘ఇన్స్పైర్’ అవార్డుల ఎంపికలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి రాష్ట్రం నుంచి మొత్తం 5,698 ప్రాజెక్టు ఇన్స్పైర్ పురస్కారాలకు ఎంపికయ్యాయి.
  • పాఠశాలల నుంచి ఆన్లైన్లో 20 వేల ప్రాజెక్టుపై దరఖాస్తు సమర్పించగా 5,698 ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయిలో 1,772 అవార్డుతో చిత్తూరు జిల్లా మొదటి స్థానం, అనంతపురం-850, నెల్లూరు-589తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • చివరి 3 స్థానాల్లో ప్రకాశం-91, శ్రీకాకుళం-71, విజయనగరం-48 జిల్లాలు ఉన్నాయి. ఈ అవార్డు కింద ఎంపికైన ఒక్కో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తుంది. ఈ మొత్తంతో విద్యార్థులు సైన్సు ప్రాజెక్టులను రూపొందించవచ్చు.