25 ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  # అమెరికా, ఒమన్‌ జట్లకు అంతర్జాతీయ వన్డే హోదా
  # ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌గా మిని ఐప్‌
  # ఆసియా రెజ్లింగ్‌ రెండో రోజు భారత్ కు ఐదు పతకాలు

  ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌గా మిని ఐప్‌

  భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) దక్షిణ మధ్య ప్రాంతీయ మేనేజర్‌గా మిని ఐప్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రాంత పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి. ఇంతకు ముందు ఆమె ఎల్‌ఐసీ విదేశీ కార్యకలాపాల వ్యవహారాలు పర్యవేక్షించారు. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌, సీఈఓగానూ విధులు నిర్వర్తించారు. ఎల్‌ఐసీలో జోనల్‌ మేనేజర్‌గా నియమితులైన మొదటి మహిళ మిని ఐప్‌ అని సంస్థ తెలిపింది.

  అమెరికా, ఒమన్‌ జట్లకు అంతర్జాతీయ వన్డే హోదా

  అమెరికా, ఒమన్‌ జట్లకు అంతర్జాతీయ వన్డే హోదా లభించింది. వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌-2 పోటీల్లో విజయాల ఆధారంగా ఈ రెండు జట్లకూ హోదా ఇస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది.

  ఆసియా రెజ్లింగ్‌ రెండో రోజు భారత్ కు ఐదు పతకాలు

  ఆసియా రెజ్లింగ్‌ రెండో రోజు జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు దక్కాయి. ఇందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ 74 కిలోల విభాగం ఫైనల్లో అమిత్‌ ధన్‌కార్‌ 0-5 స్కోరు తేడాతో కజకిస్థాన్‌ రెజ్లర్‌ దనియార్‌ కైసనోవ్‌ చేతిలో ఓటమిపాలై రజత పతకం గేలిదాడు. 92 కిలోల విభాగం టైటిల్‌ఫైట్‌లో విక్కీ 0-11తో ఇరాన్‌ కుస్తీవీరుడు అలీరెజా మహ్మద్‌ కరిమిమాచియానీ చేతిలో ఓడి రజతానికి పరిమితమయ్యాడు. మిగతా భారత రెజ్లర్లలో రాహుల్‌ అవారే (61 కి), దీపక్‌ పూనియా (86 కి), సుమిత్‌ (125 కి)లకు కాంస్యాలు లభించాయి.