# మిషన్ భగీరథకు అవార్డులు
# చైనా ఓపెన్ విజేతగా కరోలినా మారిన్
# సెయింట్ ఓపెన్‌లో దివిజ్ జంటకు డబుల్స్ టైటిల్
మిషన్ భగీరథకు అవార్డులు
నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచినందుకు మిషన్ భగీరథకు జాతీయ జల మిషన్ అవార్డు ప్రకటించింది.అలాగే సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు (టీఎస్‌డబ్ల్యూఐఆర్‌ఎస్)అవార్డు. మరియు భూగర్భజలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవానికి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు రాష్ట్ర భూగర్భజల విభాగానికి అవార్డు లభించింది.
చైనా ఓపెన్ విజేతగా కరోలినా మారిన్
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ విజేతగా నిలిచింది. చైనాలోని షాంఘై సెప్టెంబర్ 22న ముగిసిన ఈ టోర్నిలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మారిన్ 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 14-21, 21-17, 21-18తో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, విశ్వవిజేత కెంటో మొమోటా టైటిల్ దక్కించుకున్నాడు. 90 నిమిషాలపాటు జరిగిన మారథాన్ ఫైనల్లో మొమోటా 19-21, 21-17, 21-19తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన మారిన్, మొమోటాలకు 70 వేల డాలర్ల (రూ. 49 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
సెయింట్ ఓపెన్‌లో దివిజ్ జంటకు డబుల్స్ టైటిల్
సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ-250 టోర్నీలో దివిజ్ శరణ్(భారత్)-ఇగోర్ జెలెనె (స్లొవేకియా) జంటకు డబుల్స్ టైటిల్ లభించింది. రష్యాలో సెప్టెంబర్ 22న జరిగిన ఈ టోర్నిలో డబుల్స్ విభాగం ఫైనల్లో అన్‌సీడెడ్ శరణ్-జెలెనె ద్వయం 6-3, 3-6, 10-8తో బెరెటిని-బొలెలీ (ఇటలీ) జోడీపై నెగ్గింది. విజేతగా నిలిచిన దివిజ్ జంటకు 66,740 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 47 లక్షల 44 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో దివిజ్ పుణే ఓపెన్ (2019), యాంట్‌వర్ప్ ఓపెన్ (2017), లాస్ కాబోస్ ఓపెన్ (2016), బొగోటా ఓపెన్ (2013)లలో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.