22 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  # కజక్‌స్థాన్ రాజధాని ఆస్థానా పేరు మార్పు
  # ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ‘చడ్డీస్’ పదం
  # న్యూజిలాండ్ లో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలపై నిషేధం

  కజక్‌స్థాన్ రాజధాని ఆస్థానా పేరు మార్పు

  కజక్‌స్థాన్ రాజధాని ఆస్థానా పేరును నుర్‌సుల్తాన్‌గా మార్చనున్నారు.
  ఈ మేరకు దేశ మాజీ అధ్యక్షుడు నుర్‌సుల్తాన్ నజర్‌బయెవ్ గౌరవార్థం రాజధాని ఆస్థానా పేరును నుర్‌సుల్తాన్‌గా మార్చేందుకు పార్లమెంటు మార్చి 20న ఆమోదం తెలిపింది. కజక్‌స్థాన్ అధ్యక్షుడిగా ఉన్న నుర్‌సుల్తాన్ నజర్‌బయెవ్ అనూహ్యంగా మార్చి 19న తన పదవికా రాజీనామ చేశారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడైన కస్యం జొమ్రాట్ టొకయెవ్ తన తొలి అధికారిక చర్యగా రాజధాని పేరును మార్చాలని ప్రతిపాదించారు.

  ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ‘చడ్డీస్’ పదం

  కొత్త పదాలను చేర్చుకొని విడుదల కానున్న ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్‌ డిక్షనరీలో తాజాగా ఓ భారతీయ పదానికి చోటు లభించింది. మనం ఇంట్లో సరదాగా ఉపయోగించే ఆ పదం బ్రిటిష్ వాళ్లకు పరిచయం ఉన్నదే. మనదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో ప్రభుత్వ గెజిట్‌, ఇతర పబ్లికేషన్లలో దాన్ని ఉపయోగించే వారు. ఆ పదమే చడ్డీస్‌(అండర్ పాంట్స్‌).
  ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ మార్చి అప్‌డేట్‌లో 650 కొత్త పదాలు చేర్చారు. అయితే ఈ చడ్డీస్ పదాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ఉపయోగించినప్పటికీ, 1990ల్లో బీబీసీలో ప్రసారమైన బ్రిటిష్-ఏషియన్ కామెడీ సిరీస్‌ ‘గుడ్‌నెస్-గ్రేసియస్‌ మి’ తో బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు ఆ డిక్షనరీలో చడ్డీస్‌కు షార్ట్ ట్రౌజర్లు, షార్ట్స్‌, అండర్‌ పాంట్స్‌ వంటి అర్థాలు కనిపించనున్నాయి.

  న్యూజిలాండ్ లో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలపై నిషేధం

  న్యూజిలాండ్ దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జసిండ ప్రకటించారు. క్రిస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మిషన్ గన్ తో కాల్పులు జరిపి 50 మందిని హతమార్చిన ఘటన అనంతరం న్యూజిలాండ్ దేశ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.
  మిలటరీ తరహా సెమీ ఆటోమేటిక్ తుపాకులను ఇక నుంచి విక్రయించరాదు. ఏప్రిల్ 11 నుంచి ఆయుధాల చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు.