21 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  8

  *డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి జాతీయ పురస్కారం
  *సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
  *ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ యాంగ్
  *ఆంధ్రా షుగర్స్ ఎండీ నరేంద్రనాథ్ కు 2019 ఏబీసీజెడ్ ప్రతిభ అవార్డు

  *డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి జాతీయ పురస్కారం
  ఏపీ-తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్‌రెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది.
  ఈ మేరకు జస్టిస్ వి.ఆర్.కృష్ణ అయ్యర్ 104వ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో నవంబర్ 20న క్యాపిటల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధేయ విధానాలతో గ్రామీణ ప్రజల అభ్యన్నతికి పాటుపడినందుకుగాను రాజేందర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కింది. అలాగే కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్జోషి జీవిత సాఫల్య పురస్కారం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ జిత్‌సేన్ జస్టిస్ కులదీప్‌సింగ్ అవార్డును అందుకున్నారు.

  *సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
  సింబెక్స్ నావికా విన్యాసాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలో నవంబర్ 20న సమావేశమయ్యారు.
  ఈ సమావేశంలో భారత్, సింగపూర్ రక్షణ బంధం మరింత దృఢమయ్యేందుకు దోహదపడే డిఫెన్స్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(డీసీఏ)పై ఇరుదేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. పాతికేళ్ల ద్వైపాక్షిక బంధానికి ప్రతీకగా సింబెక్స్-2018 పేరుతో భారత్, సింగపూర్ దేశాలు విశాఖతీరంలో నావికా విన్యాసాలను నిర్వహించాయి.

  *ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ యాంగ్
  అంతర్జాతీయ పోలీసు సంస్థ-ఇంటర్‌పోల్ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ యాంగ్(57) ఎన్నికయ్యారు. యూఏఈలోని దుబాయ్‌లో 2018 నవంబర్ 21న జరిగిన వార్షిక సమావేశంలో కిమ్ జాంగ్ యాంగ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్‌పోల్ వెల్లడించింది.
  • ఆయన ఈ పదవిలో యాంగ్ 2020 వరకూ కొనసాగుతారు. ఇప్పటివరకూ ఇంటర్‌పోల్ అధ్యక్షుడిగా ఉన్న చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే 2019 సెప్టెంబర్‌లో అదృశ్యం కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
  • చైనా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లంచం ఆరోపణపై బీజింగ్‌లో విమానం దిగగానే ఆ దేశ అధికారులు మెంగ్ హాంగ్వేను అదుపులోకి తీసుకున్నారు.
  • ఈ ఎన్నికల సందర్భంగా రష్యా అభ్యర్థి, ఇంటర్‌పోల్ ఉపాధ్యక్షుడు అలెగ్జాండర్ ప్రోకోప్చుక్ అభ్యర్థిత్వాన్ని అమెరికా నేతృత్వంలోని పశ్చిమదేశాలు వ్యతిరేకించాయి.

  *ఆంధ్రా షుగర్స్ ఎండీ నరేంద్రనాథ్ కు 2019 ఏబీసీజెడ్ ప్రతిభ అవార్డు
  అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేసినందుకుగాను ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ కు బ్రెజిల్ కు చెందిన జెబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ ‘2019 ఏబీసీజెడ్ ప్రతిభ అవార్డు’ను ప్రకటించింది.
  • ఈ పురస్కారాన్ని 2019 మే 3న బ్రెజిల్‌లోని ఉబిరాబ పట్టణంలో నిర్వహించే 85వ జెబు-ఇంటర్నేషనల్ కేటిల్ ఎక్స్పో సందర్భంగా అందజేస్తారు.