2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్‌

  0
  8

  ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ. GDP ( డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి ) ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది.

  పెట్టుబడులు, వినియోగంలో వృద్ధి కనబరుస్తున్న వృద్ధి మరియు ఇతర అంశాల ఆధారంగా 2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంగా భారత్‌ ఎదుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది

  ‘ప్రస్తుతం మన దేశ జీడీపీ 2.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2024 నాటికి ఇది 5 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

  2030 లేదా 2031 నాటికి భారత జీడీపీ 10 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందనీ వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, లింగ సమానత్వం, గ్రామీణ విస్తరణ వంటిని మరింత మెరుగుపరిచడం ద్వారా అభివృద్దిలో దేశం దూసుకెళ్తు అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తి గల దేశంగా అవతరించనుంది.

  2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభాలో 21.9శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారు. ప్రస్తుత వృద్ధిరేటును బట్టి చూస్తే ఇది 17శాతానికి తగ్గే అవకాశం ఉంది.

  ఇక 2021 జనాభా లెక్కల నాటికి దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారి సంఖ్య 15శాతానికి పడిపోతుందని ఆర్ధిక శాఖ అంచనా వేసింది.అదే సమయంలో మధ్యతరగతి జనాభా 44శాతానికి పెరిగే అవకాశాలున్నాయన్నారు.

  భారత ఆర్థిక వ్యవస్థ:

  శ్రమ ఆర్థిక వ్యవస్థ.
  వ్యవసాయం, హస్తకళలు, పరిశ్రమలు మరియు సేవలు వంటి రంగాలతో విభిన్నమై ఉంది.
  ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ(పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా)