2021 మార్చి 1 నుంచి భారత జనగణన

  0
  11

  దేశంలో కొత్త జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2021 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం అవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

  మార్చి 1ని ప్రతిపాదిత తేదీగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

  ‘జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో మాత్రం 2020 అక్టోబర్‌ 1వ తేదీని ప్రతిపాదిత తేదీగా నిర్ణయించింది.

   ఆయా రాష్ట్రాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే అక్కడ జనగణన మొదలుపెట్టనున్నట్లు.’ కేంద్ర హోంశాఖ వివరించింది.

  2011లో జరిగిన జనగణనలో మన దేశ జనాభా 121 కోట్లు

  జనాభా లెక్కల యొక్క నినాదం ‘మన జనాభా లెక్కలు, మన భవిష్యత్తు’

  స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఇప్పటివరకు(2011) 15 సార్లు దేశంలో జన గణన జరిగింది

  స్వాతంత్య్రానికి తరువాత 8వ జనాభా లెక్కలు (2021)

  వివేక్ జోషి – రిజిస్ట్రార్ జనరల్ , జనగణన