2019-20 బడ్జెట్ ముఖ్యాంశాలు

  0
  9

  తాత్కాలిక విత్తమంత్రి పీయూష్‌ గోయల్‌ చదివి వినిపించిన బడ్జెట్‌ పాఠం నిండా… సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండు మాసాల ముందు ‘బడ్జెట్‌’ రూపంలో అందివచ్చిన ఆఖరి అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడన్న ధోరణే ప్రతిధ్వనించింది.

  *రూ ఐదు లక్షల్లో ఆదాయం పొందే వారికి పూర్తి పన్ను మినహాయింపు
  *ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) పరిమితి రూ 40,000 నుంచి రూ 50,000 పెంపు
  *రెండో సొంత ఇంటికి అద్దె పై పన్ను రాయితీ
  *దాదాపు 12 కోట్ల సన్న,చిన్న కారు రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి 6,000
  *తొలిసారి రూ 3,00,000 కోట్లు దాటిన రక్షణ బడ్జెట్
  *ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకం కింద 10 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు నెలకు రూ 3000 చొప్పున పింఛను
  *జాతీయ విద్యా మిషన్ కు రూ 38,572 కోట్లు
  *రాబోయే ఐదేళ్ళలో లక్ష ఊళ్లు డిజిటల్ గ్రామాలుగా మార్పు
  *కృత్రిమ మేధ పరిజ్ఞానం ప్రోత్సాహానికి ప్రత్యేక కార్యక్రమం
  *1.5 కోట్ల మంది మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు
  *జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ 60,000 కోట్లు
  *గో సంపద వృద్ధికి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఏర్పాటు