16ఏళ్ల బాలుడికి శౌర్యచక్ర ప్రదానం

  0
  8

  ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16ఏళ్ల బాలుడు ఇర్ఫాన్‌ రంజాన్‌ షేక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం శౌర్యచక్ర పతకాన్ని ప్రదానం చేశారు.

  2017 అక్టోబరు 16న కశ్మీర్‌లోని ఇర్ఫాన్‌ ఇంటిని ముగ్గురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు. మాజీ గ్రామ సర్పంచ్‌ అయిన తండ్రితోపాటు ఇతర కుటుంబ సభ్యులను కాపాడుకొనేేందుకు వారితో ఇర్ఫాన్‌ పోరాడాడు. చిన్నవయసులోనే అతడు చూపిన అసమాన ధైర్యసాహసాలకు రాష్ట్రపతి తాజా పురస్కారాన్ని ప్రదానం చేశారు.

  తన తండ్రిని చంపడానికి ఇంటి మీద దాడికి తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులతో.. 14 ఏళ్ల కుర్రాడు అసాధారణ రీతిలో పోరాడాడు. వారి దగ్గర ఆయుధాలున్నప్పటికీ.. వెరవకుండా ఎదురుదాడి చేశాడు. వారిని ఇంట్లో అడుగుపెట్టనీయకుండా అడ్డుకుని తన తండ్రి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన 2017లో జమ్మూకశ్మీర్లో చేసుకుంది. ఉగ్రవాదులతో పోరాడిన ఆ కుర్రాడి పేరు ఇర్ఫాన్ రంజాన్ షేక్. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ టీనేజర్ మంగళవారం రాష్ట్రపతి చేతుల మీద శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నాడు.

  తన తండ్రిని, కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి మరీ ఇమ్రాన్ అద్భుతంగా పోరాడాడని, మిలిటెంట్లతో పోరాటంలో తెగువను, పరిపక్వతను కనబరిచాడని రాష్ట్రపతి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు.

  శౌర్య చక్ర:

  ఇది పతకం వృత్తాకారంలో ఉండే కాంస్య పతకం. మధ్యలో ధర్మచక్రం ఉండి దాని చుట్టూ తామర పువ్వుల వరుస ఉంటుంది. ఈ పతకం వెనుక భాగంలో ‘శౌర్య చక్ర’ అని ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో రాసి ఉంటుంది. దీంతో పాటు రిబ్బన్‌ను జత చేస్తారు. ఇది ముదురుపచ్చ రంగులో ఉన్న ఈ రిబ్బను నారింజ రంగు లైను నాలుగు భాగాలు విభజిస్తుంది. శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారం ఇది. శాంతి పరిరక్షణలో ముఖ్య భూమిక పోషించిన పౌరులు, పోలీసు, మిలిటరీ సిబ్బందికి ఇస్తారు. ఈ పురస్కారాన్ని మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు ఈ అవార్డును 1997 మందికి అందజేశారు.