15 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  14

  # ఏపీ పాఠశాల విద్యాకమిషన్ చైర్మన్‌గా కాంతారావు
  # ఆంధ్రా బ్యాంకు విలీనానికి బోర్డు ఆమోదం
  # గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్

  ఏపీ పాఠశాల విద్యాకమిషన్ చైర్మన్‌గా కాంతారావు

  ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు నియమితులు కానున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కమిషన్‌కు వైస్ చైర్మన్‌గా జాతీయ స్థాయిలో పేరు పొందిన విద్యారంగ నిపుణుడు ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్యదర్శి స్థాయి అధికారి సీఈవోగా వ్యవహరిస్తారు.

  ఆంధ్రా బ్యాంకు విలీనానికి బోర్డు ఆమోదం

  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంకులతో విలీనం అయ్యేందుకు ఆంధ్రా బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన బ్యాంకుగా మూడు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో విలీనం చేసే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని అఖిల భారత ఆంధ్రా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ పెడరెషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌వి సత్యనారాయణ, ఆంధ్రా బ్యాంక్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎ్‌సఎన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

  గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్

  ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత వర్ధమాన అథ్లెట్ హిమదాస్ వ్యవహరించనుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం పెప్సీకో ఇండియా సెప్టెంబర్ 12న హిమదాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రపంచ చాంఫియన్ పీవీ సింధు, స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్యాటొరేడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు హిమదాస్ ఎంపికైన విషయం తెలిసిందే.