14 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2018

  0
  17

  # ఆటిజం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
  # భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ADB
  #ఐరాస మంత్రుల సదస్సులో ఏకే మెహతా
  # పార్ట్‌నర్స్ ఫోరమ్ సదస్సు ప్రారంభం
  # క్రాస్‌బౌ క్షిపణి విన్యాసాలు ముగింపు

  # ఆటిజం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్‌ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)-2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది

  # భారత్ వృద్ధి రేటు 7.3 శాతం: ADB

  ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)
  భారత్ వృద్ధిరేటు :
  2018-19 – 7.3 శాతం.
  2019-20 – 7.6 శాతం.
  నివేదిక పేరు : ‘ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ) 2018 అప్‌డేట్’
  చైనా :
  2018-19 – 6.6 శాతం.
  2019-20లో 6.3 శాతం.

  #ఐరాస మంత్రుల సదస్సులో ఏకే మెహతా
                                                                                                                            పోలెండ్‌లోని కటోవైస్ నగరంలో జరుగుతున్న వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి మంత్రుల సదస్సులో డిసెంబర్ 13న భారత్ తరఫున కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి ఏకే మెహతా పాల్గొన్నారు.
  ఈ సదస్సులో మెహతా మాట్లాడుతూ… పారిస్ వాతవరణ ఒప్పందం-2016లో ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం లేదని చెప్పారు. పారిస్ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన లక్ష్యాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ అందుకోవాలనీ, బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఖతార్ రాజధాని దోహాలో వాతావరణ సదస్సు సందర్భంగా కుదిరిన ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  # పార్ట్‌నర్స్ ఫోరమ్ సదస్సు ప్రారంభం

  రెండ్రోజులపాటు జరిగే ‘పార్ట్‌నర్స్ ఫోరమ్ – 2018’ సదస్సును న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 12న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ప్రజారోగ్యంపై భారత్ చేస్తున్న ఖర్చును 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచుతామని చెప్పారు.
  ఆయుష్మాన్ భారత్ పథకం రెండు భాగాలుగా అమలవుతుందని పేర్కొన్నారు. అందులో ఒకటైన ‘ప్రధానమంత్రి ప్రజారోగ్య కార్యక్రమం’ కింద 50 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. రెండో భాగంలో ప్రజలకు చేరువలో సమగ్ర ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కోసం 2022 నాటికి దేశంలో ఒకటిన్నర లక్షల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తామని వివరించారు. ప్రస్తుతం భారత్ జీడీపీలో 1.15 శాతాన్ని ప్రజారోగ్యంపై ఖర్చు చేస్తోంది.

  # క్రాస్‌బౌ క్షిపణి విన్యాసాలు ముగింపు

  క్రాస్‌బౌ-2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు డిసెంబర్ 13న ముగిశాయి.
  గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో డిసెంబర్ 3 నుంచి జరిగిన ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. ఈ విన్యాసాల్లో ఎస్.యూ-30 ఫైటర్ జెట్‌తోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా-ఎక్-ఎం, ఐజీఎల్‌ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా పరీక్షించారు.

  సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్‌బౌ విన్యాసాల్లో భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు.