12 బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినేట్‌

  0
  7

  ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.

  శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చించారు.

  రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌ తదితర విషయాలను చర్చించారు.

  మొత్తం 12 బిల్లులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

  అంగన్వాడీల వేతనం రూ.1000 పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర బిల్లులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

  కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా, భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

  భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించే ముసాయిదా బిల్లుకు, భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులకు ఉద్దేసించిన ముసాయిదాకు ఆమోద ముద్రవేసింది.

  మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.