11 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  * వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో
  వరల్డ్‌ నంబర్‌వన్‌ మేరీకోమ్‌
  *అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన
  *సహస్త్ర సీమబల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కుమార్‌ రాజేష్‌చంద్ర

  వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో

  వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
  ఆ దేశ రాజధాని కారకస్ లో జనవరి 10న జరిగిన కార్యక్రమంలో మదురో ప్రమాణస్వీకారం చేశారు. వెనెజులా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు.

  వరల్డ్‌ నంబర్‌వన్‌ మేరీకోమ్‌

  భారత మహిళా బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ తన ఘనమైన కెరీర్‌లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ మణిపూర్‌ మాణిక్యం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్‌వన్‌గా నిలిచింది. 36 ఏళ్ల ఈ వెటరన్‌ బాక్సర్‌ గత నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్‌ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది.

  అమరావతి వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉండే వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 10న శంకుస్థాపన చేశారు.
  గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) ఈ గ్యాలరీని నిర్మించనుంది. 5 ఎకరాల్లో నిర్మించే ఈ గ్యాలరీని రోజుకు 2 వేల నుంచి 3వేల మంది సంద ర్శించవచ్చు. రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న అవకాశాలేమిటనే అంశాలను ‘వెల్‌కమ్ గ్యాలరీ’లో చూపించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సింగపూర్ సహకారంతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

  సహస్త్ర సీమబల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కుమార్‌ రాజేష్‌చంద్ర

  సహస్త్ర సీమబల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కుమార్‌ రాజేష్‌చంద్ర నియమితులయ్యారు. 1985 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయిన కుమార్‌ రాజేష్‌చంద్ర 2021 డిసెంబర్‌ 31 వరకు ఈ పదవిలో ఉండనున్నారు. సహస్త్ర సీమాబల్‌ నేపాల్‌, భూటాన్‌లోని భారత సరిహద్దులో పహారా కాస్తుంది.