10 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  32

  *ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
  *ఆసియా ఎయిర్గన్లో మను-సౌరభ్ జంటకు స్వర్ణం
  *తొలి ఏఐ యాంకర్లను రూపొందించిన చైనా
  *గణతంత్ర దినోత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

  *ఏపీ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
  4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్-2018 వైఎస్ఆర్ కడప జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో నవంబర్ 9న ప్రారంభమైంది.
  3 రోజుల పాటు నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్ ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2019లో నిర్వహించనున్న 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను శ్రీకాకుళంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

  *ఆసియా ఎయిర్గన్లో మను-సౌరభ్ జంటకు స్వర్ణం
  ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు మను భాకర్- సౌరభ్ చౌదరి జంటకు స్వర్ణ పతకం లభించింది.
  కువైట్‌లో నవంబర్ 9న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో మను-సౌరభ్ జంట 485.4 పాయింట్లు స్కోరు చేసి జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. సౌరభ్‌కు ఈ టోర్నీలో ఇది మూడో స్వర్ణం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు. వాంగ్ జియాయు-జీ హాంగ్ సుఖి (చైనా, 477.9 పాయింట్లు) జోడీకి రజతం, వాంగ్-హాంగ్ (చైనా, 413.5) జంటకు కాంస్యం లభించాయి.

  *తొలి ఏఐ యాంకర్లను రూపొందించిన చైనా
  ప్రపంచంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేసే సింథటిక్ వర్చువల్ యాంకర్లను చైనా రూపొందించింది.
  చైనాలో ప్రతిఏటా జరిగే ‘వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్’లో నవంబర్ 9న ఈ యాంకర్లను ఆవిష్కరించారు. చైనా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ జిన్హువాలో ఈ కృత్రిమమేధ యాంకర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక యాంకర్ చైనీస్ భాషలో వార్తలు చదివేలా, మరొకటి ఇంగ్లిష్‌లో చదివేలా సమాచారాన్ని ఫీడ్ చేశారు. ఈ వర్చువల్ యాంకర్లు అలసట లేకుండా 24 గంటలు విధులు నిర్వహించడంతోపాటు మనుషుల్లా హావభావాలు పలికిస్తారు. చైనాలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ సౌగౌ, జిన్హువాలు సంయుక్తంగా ఈ యాంకర్లను అభివృద్ధి చేశాయి.

  *గణతంత్ర దినోత్సవాలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
  గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ప్రధాని మోదీ ఓ ప్రకటన చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పిలవాలని అనుకున్నారు. ఇతర కార్యక్రమాలవల్ల ఆయన హాజరు కావడం లేదంటూ శ్వేతసౌధం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.