09 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  13

  # ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో సంధ్యకు స్వర్ణం
  # పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా
  # మలేసియా రాజు సుల్తాన్ రాజీనామా
  హాప్‌మన్ కప్ విజేత ఫెడరర్-బెన్సిచ్ జట్టు

  ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో సంధ్యకు స్వర్ణం

  ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజయవాడకి చెందిన గోలి సంధ్య స్వర్ణ పతకం సాధించింది.
  థాయ్‌లాండ్‌లో జనవరి 5న జరిగిన మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్లకుగాను సంధ్య ఆరు పాయింట్లు సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో జావో యుజువాన్ (చైనా) రజతం, సన్ ఫురోంగ్ (చైనా) కాంస్యం గెలిచారు. తాజా విజయంతో సంధ్య 2019లోనే మెక్సికోలో జరిగే ప్రపంచ అమెచ్యూర్ చాంపియన్ షిప్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

  పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా

  పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు జనవరి 5న ఉత్తర్వులు జారీచేసింది.
  దీంతో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం-2018 కింద దేశ, విదేశాలో ఉన్న మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా నిలిచారు.

  మలేసియా రాజు సుల్తాన్ రాజీనామా

  మలేసియా రాజు సుల్తాన్ ముహమ్మద్ 5 జనవరి 6న తన పదవికి రాజీనామా చేశారు.
  దీంతో పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా ఆయన నిలిచారు. మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు కాగా, ముహమ్మద్ రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. మలేసియాలో 9 వంశాల మధ్య ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది.

  హాప్‌మన్ కప్ విజేత ఫెడరర్-బెన్సిచ్ జట్టు

  అంతర్జాతీయ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ హాప్‌మన్ కప్ విజేతగా రోజర్ ఫెడరర్-బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) జట్టు నిలిచింది.
  ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జనవరి 5న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్-బెన్సిచ్ ద్వయం 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్-ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) జట్టుపై విజయం సాధించింది. దీంతో మూడుసార్లు హాప్‌మన్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి తొలిసారి టైటిల్ సాధించిన ఫెడరర్, 2018లో బెన్సిచ్తో కలిసి ఈ ఘనత సాధించాడు.