08 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  5

  $ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఓఎస్డీగా శ్రీనివాస్‌
  $ హిందుస్తాన్ జింక్ చైర్మన్‌గా కిరణ్ అగర్వాల్
  $ ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం

  దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఓఎస్డీగా శ్రీనివాస్‌

  విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు ఓఎస్డీగా ఎస్‌.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఖరారుపై ఆయన పనిచేయనున్నారు. రైల్వేలో చీఫ్‌ పర్సనల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఓఎస్డీగా నియమిస్తూ దక్షిణమధ్య రైల్వే జీఎం గజానంద్‌ మాల్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దక్షిణమధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే జోన్లను పునర్‌విభజించి దక్షిణకోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓఎస్డీని నియమించడంతో విభజన ప్రక్రియ మరో అడుగు ముందుకు పడినట్లయింది.

  హిందుస్తాన్ జింక్ చైర్మన్‌గా కిరణ్ అగర్వాల్

  హిందుస్తాన్ జింక్ కంపెనీ చైర్మన్‌గా కిరణ్ అగర్వాల్ నియమితులయ్యారు.
  2019, మార్చి 2 నుంచే ఆమె నియామకం అమల్లోకి వస్తుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఆమెను అదనపు డెరైక్టర్‌గా కూడా నియమించామని వెల్లడించింది. అగ్నివేశ్ అగర్వాల్ స్థానంలో కిరణ్ అగర్వాల్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జింక్, లెడ్, వెండి లోహాలను ఉత్పత్తి చేస్తున్న హిందుస్తాన్ జింక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ టన్నులుగా ఉంది.

  ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం

  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైన ఐటీబీపీ (ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్) 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
  అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1,095 కోట్లతో నిర్మించిన బీఎస్‌ఎఫ్, సీఎఫ్‌ఎస్‌ఎల్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ, ఎల్‌పీఏఐ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. దేశ రక్షణలో పారామిలటరీ బలగాల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.