07 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  $ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్‌ బాబ్డే
  $ క్యూఎస్‌ ర్యాంకింగ్‌ల జాబితాలో దిల్లీ, బొంబాయి ఐఐటీలు

  నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్‌ బాబ్డే

  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే మంగళవారం జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థకు జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. గురువారం జస్టిస్‌ బాబ్డే బాధ్యతలు స్వీకరిస్తారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ అవసరమైన వారికి ఉచిత న్యాయసహాయం అందిస్తుంది. కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు లోక్‌ అదాలత్‌లను కూడా నిర్వహిస్తుంది.

  క్యూఎస్‌ ర్యాంకింగ్‌ల జాబితాలో దిల్లీ, బొంబాయి ఐఐటీలు

  అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక ‘క్వాకరెల్లీ సిమండ్స్‌’ (క్యూఎస్‌) ప్రకటించిన ర్యాంకింగ్‌లలో దిల్లీ, బొంబాయి ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్‌సీ స్థానం సంపాదించుకున్నాయి.
  ప్రపంచస్థాయిలో అత్యుత్తమంగా నిలిచిన మూడువందల విద్యాసంస్థల్లో వీటికి చోటు దక్కింది. ఐఐటీ-బొంబాయికి 162వ ర్యాంకు, ఐఐఎస్‌సీ-బెంగళూరుకు 170వ ర్యాంకు దక్కింది. దిల్లీ ఐఐటీ 172వ ర్యాంకును…ఐఐటీ-కాన్పూర్‌ 283వ ర్యాంకును సాధించాయి. ఐఐటీ మద్రాసు 264 ర్యాంకులో ఉంది.