07 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  5

  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎం.ఎ.షరీఫ్‌
  వధువును ఆశీర్వదిస్తూ అస్సాం ప్రభుత్వం తులం బంగారం

  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎం.ఎ.షరీఫ్‌

  ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి నామినేషన్లు స్వీకరించగా ఎం.ఎ.షరీఫ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.
  నేడు షరీఫ్‌ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌.ఎండి.ఫరూక్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.
  మండలి ఛైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నోటిఫికేషన్‌ జారీ చేశారు

  వధువును ఆశీర్వదిస్తూ అస్సాం ప్రభుత్వం తులం బంగారం

  పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే వధువుకు ప్రభుత్వం తరఫున తులం బంగారం (11.66 గ్రాములు) అందజేస్తామని అసోంలో సోనోవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమాంత్‌ బిశ్వ శర్మ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
  ఇందులో పేదలపై వరాల జల్లు కురిపించారు. పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తామని ప్రతిపాదించారు.
  వధువుకు తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. మొత్తం రూ.1,193 కోట్ల లోటుతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి తాజాగా ఎలాంటి పన్నులు విధించలేదు.

  ఆర్థిక మంత్రిః హిమాంత్‌ బిశ్వ శర్మ

  ముఖ్య మంత్రిః సర్బానంద సోనోవాల్