05 మే కరెంట్ అఫైర్స్ 2019

  0
  23

  # 126 గంటల పాటు ఆగకుండా డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
  # వ్యవసాయశాఖకు ‘ఈ-గవర్నెన్స్‌ అవార్డు’
  # పన్ను వసూళ్లలో సిరిసిల్ల స్టేట్‌ ఫస్ట్‌
  # జాతీయ స్థాయి రెగెట్టాలో స్వర్ణం గెలిచిన శిరీష

  126 గంటల పాటు ఆగకుండా డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్

  ⇒ 126 గంటల పాటు ఆగకుండా డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది 18 ఏండ్ల నేపాలీ బాలిక బంధనా నేపాల్. తూర్పు నేపాల్‌లోని ధన్‌కుటా జిల్లాకు చెందిన బంధనా వ్యక్తిగత విభాగంలో సుదీర్ఘ నృత్య మారథాన్‌లో ఈ ఘనత సాధించింది.

  ⇒ బంధనా కంటే ముందు ఈ రికార్డు భారతీయ బాలిక హేమలత పేరిట ఉండేది. 2011లో 123 గంటల 15 నిమిషాల పాటు హేమలత నృత్యం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.

  వ్యవసాయశాఖకు ‘ఈ-గవర్నెన్స్‌ అవార్డు’

  ⇒ రైతులు విత్తనాలను ఆన్‌లైన్‌లో పొందేలా చేస్తున్న వ్యవసాయశాఖను సీఎ్‌సఐ నిహిలెంట్‌ సంస్థ ఈ-గవర్నెన్స్‌ పురస్కారానికి ఎంపిక చేసింది.ossds.telangana.gov.in ఆన్‌లైన్‌ సబ్సిడీ సీడ్‌ పంపిణీ పథకం పేరుతో వ్యవసాయ శాఖ రెండేళ్లుగా వెబ్‌సైట్‌ ద్వారా రైతులకు రాయితీపై మేలురకం విత్తనాలను అందిస్తోంది.

  పన్ను వసూళ్లలో సిరిసిల్ల స్టేట్‌ ఫస్ట్‌

  ⇒ ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సి పాలిటీ రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అధికారులు 2018-19 సంవ త్సరానికి 100% పన్ను వసూలు చేశారు.

  ⇒ ఏప్రిల్‌ 31 వరకు ముందస్తు పన్ను చెల్లించిన వారికి 5% రాయితీ ఇవ్వడంతో ఇప్పటికే 22% మంది ప్రజలు రూ.75 లక్షల పన్నులు చెల్లించారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి, రెవెన్యూ అధికారి గణే్‌షరెడ్డిలకు మున్సిపల్‌ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ప్రశంసాపత్రం అందించారు.

  జాతీయ స్థాయి రెగెట్టాలో స్వర్ణం గెలిచిన శిరీష

  ⇒ ముంబయిలో జరిగిన జాతీయ స్థాయి జూనియర్‌ కోస్టల్‌ మల్టీక్లాస్‌ రెగెట్టా ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్‌ శిరీష పసిడి సొంతం చేసుకుంది.