05 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  11

  * రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
  * బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
  * టి20 ఫార్మాట్‌లో స్మృతి మంధాన రికార్డు
  * తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ

  రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన

  ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న శంకుస్థాపన చేశారు.
  ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ… భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే-203 రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుందని చెప్పారు. భారత రక్షణ బలగాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.

  బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

  గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4న ప్రారంభించారు.
  అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోమని చెప్పారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని అన్నారు.

  టి20 ఫార్మాట్‌లో స్మృతి మంధాన రికార్డు

  టి20 ఫార్మాట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా స్మృతి మంధాన(22 ఏళ్ల 229 రోజులు) రికార్డు నెల కొల్పింది.
  అస్సాంలో గువాహటిలోని బర్సపర స్టేడియంలో మార్చి 4న ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌తో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధానకు తొలిసారి జాతీయ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఈ రికార్డు సురేశ్ రైనా(23 ఏళ్ల 197 రోజులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 ఏళ్ల 237 రోజులు) పేరిట ఉండేది.

  తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ

  సీఎం కేసీఆర్ పీఆర్వోగా పనిచేస్తున్న ట్రాన్స్ కో జీఎం గటిక విజయ్ కుమార్ రచించిన ‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం’(తెలుగులో), ‘ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్’(ఇంగ్లిష్‌లో) పుస్తకాలను మార్చి 4న ఆవిష్కరించారు.
  హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదర్కొన్న తీరును ఈ పుస్తకాలలో వివరించారు.