05 జూన్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  9

  # అమల్‌రాజ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం
  # శ్రీసిటీకి ఇండియాస్ బ్రాండ్ అవార్డు
  # ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్పు
  # హైదరాబాద్‌లో ఇండియన్ ఓషన్ సదస్సు

  అమల్‌రాజ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం

  భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. భారత ఫుట్‌బాల్‌ రంగానికి చేసిన సేవలకు గాను కోల్‌కతాకు చెందిన ప్రముఖ మహమ్మదిన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ (ఎంఎస్‌సీ) అమల్‌రాజ్‌ను జీవితకాల సాఫల్య పురస్కారం ‘షాన్‌ ఈ మహమ్మదిన్‌’ అవార్డుతో సత్కరించింది. అమల్‌రాజ్‌ ఎంఎస్‌సీ తరపున ఆరేళ్లు ప్రాతినిథ్యం వహించాడు.

  శ్రీసిటీకి ఇండియాస్ బ్రాండ్ అవార్డు

  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీకి ‘ఇండియాస్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్-2019’ అవార్డు లభించింది. ఎన్‌డీటీవీ అనుబంధ సంస్థ అయిన ది బ్రాండ్ స్టోరీ ఈ అవార్డును శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి అందజేసింది. శ్రీసిటీ అభివృద్ధిపై బ్రాండ్ స్టోరీ సంస్థ తీసిన ప్రత్యేక కథనాన్ని జూన్ 2న ఎన్‌డీటీవీ ప్రాఫిట్ టీవీలో ప్రసారం చేశారు.

  ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరు మార్పు

  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మారుస్తున్నట్లు జూన్ 3న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుగా వ్యవహరిస్తున్నారు.

  హైదరాబాద్‌లో ఇండియన్ ఓషన్ సదస్సు

  హైదరాబాద్‌లోని నొవాటెల్‌లో జూన్ 9 నుంచి 21 వరకు ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ 23వ సదస్సుని నిర్వహించనుంది. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సులో ట్యూనా జాతి చేపల సంతతి పెంపొందించడం, వాటి సంరక్షణ, ట్యూన్ మాంసం ఉత్పత్తిని విస్తృతం చేయడం వంటి అంశాలపై చర్చించనున్నారు. 33 దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సు తొలిసారిగా భారత్‌లో జరుగుతుందని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తెలిపారు.