04 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  11

  * సీఐఎస్‌ఎఫ్‌ గిన్నిస్‌ రికార్డు
  * కుంభమేళాలో మూడు గిన్నిస్‌ రికార్డులు
  * తొలి దేశీయ 4జీ చిప్ ఆవిష్కరణ

  సీఐఎస్‌ఎఫ్‌ గిన్నిస్‌ రికార్డు

  కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు ఆదివారం రికార్డు సృష్టించారు. నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై 1,327 సైకిళ్లను ఒకదాని వెంట మరొకటి వరుసగా నడిపి గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఇదివరకు 1,235 సైకిళ్లతో హుబ్బళ్లి బైస్కిల్‌ క్లబ్‌ పేరుతో ఉన్న ఘనతను వీరు తిరగరాశారు. సీఐఎస్‌ఎఫ్‌ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

  కుంభమేళాలో మూడు గిన్నిస్‌ రికార్డులు

  ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మూడు గిన్నిస్‌ రికార్డులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. 10వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని పరిశుభ్రతా చర్యలు చేపట్టడం. అలాగే మార్చి 1న జరిగిన పెయింటింగ్‌ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కళాకారులు పాల్గొని మరో రికార్డు నెలకొల్పారు. ఫిబ్రవరి 28న 503 షటిల్‌ బస్సులలో యాత్రికులు కుంభమేళాకు చేరుకోవడం కూడా ఓ రికార్డే. ఈ మేరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని కార్యక్రమాలను పరిశీలించి ధ్రువీకరించారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

  తొలి దేశీయ 4జీ చిప్ ఆవిష్కరణ

  తొలిసారి దేశీయంగా రూపొందించిన4జీ సెమీకండక్టర్ చిప్‌ను బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ ఫిబ్రవరి 27న ఆవిష్కరించింది.

  4జీ, ఎల్‌టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి ఈ సెమీకండక్టర్ చిప్స్ అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు.