04 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  8

  *రైఫిళ్ల కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం
  *కార్పొరేషన్‌ బ్యాంకు సీఈఓగా పీవీ భారతి
  *మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్‌) నుంచి తప్పుకున్నరష్యా

  రైఫిళ్ల కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం

  పదాతిదళాల ఆధునికీకరణలో భాగంగా రక్షణ శాఖ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 73,000 రైఫిళ్ల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

  *ఈ రైఫిళ్లను అమెరికా నుంచి ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో భారత్ కొనుగోలు చేయనుంది.
  * సిగ్ సౌవర్ రైఫిళ్ల కొనుగోళ్లకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నాయి. దాదాపు 3,600 కి.మీ. పొడవున్న చైనా సరిహద్దు వెంట విధులు నిర్వర్తించే బలగాలకు ఈ రైఫిళ్లను అందజేయనున్నామని తెలిపాయి. ఈ రైఫిళ్లను ఇప్పటికే అమెరికా, ఇతర యురోపియన్ దేశాలు ఉపయోగిస్తున్నాయని వివరించాయి.
  రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

  కార్పొరేషన్‌ బ్యాంకు సీఈఓగా పీవీ భారతి

  కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ భారతిని కార్పొరేషన్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా నియమిస్తున్నట్లు కార్పొరేషన్‌ బ్యాంకు తెలిపింది. బ్యాంకు చరిత్రలోనే ఒక మహిళకు ఈ హోదా దక్కడం ఇదే ప్రథమం.

  సెప్టెంబరు 15, 2016 నుంచి ఆమె కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆమెకు 37 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆమె తమిళనాడు, నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్‌) పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించారు.

  మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్‌) నుంచి తప్పుకున్నరష్యా

  అమెరికా బాటలోనే ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ‘మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక (ఐఎన్‌ఎఫ్‌)’ నుంచి రష్యా కూడా వైదొలగింది! ఈ ఒప్పందం నుంచి తప్పుకొంటున్నట్టు అమెరికా ప్రకటించినందున, తాము కూడా అదే నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు

  విదేశాంగ, రక్షణశాఖ మంత్రులతో దృశ్య మాధ్యమ సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.
  స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను నిషేధిస్తూ రూపొందించిన ఈ ఒప్పందంపై 1987లో అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌లు సంతకాలు చేశాయి.