04 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2018

  0
  17

  *గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018
  *ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన శాఖకు 3 పురస్కారాలు
  *ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఘంటా రామారావు
  *దివ్యాంగుల సంక్షేమ శాఖకు జాతీయ అవార్డు
  *టీ రేషన్ యాప్ కు ఈ గవర్నెన్స్ అవార్డు

  *గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018
  గ్లోబల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సమ్మిట్ 2018 ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించాడు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ మరియు NITI ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యాయి.

  *ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన శాఖకు 3 పురస్కారాలు
  సుస్థిర విద్యుత్తు రంగంలో భారీ పెట్టుబడులకు అనుకూలం, మౌలిక సౌకర్యా కల్పనలో ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పురస్కారం సాధించింది. విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ పనితీరుతో ఏపీజెన్‌కో అవార్డును కైవసం చేసుకుంది. ఇంధన పునరుత్పాదక వనరుల విభాగంలో ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌కు ‘యోమెన్‌ జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌టైమ్‌ యోమెన్‌ కంట్రిబ్యూషన్‌)’ లభించింది.
  గుజరాత్‌లోని సియాక్‌ (సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరిగిన 12వ ‘ప్రకాశ్‌మే ఎనర్షియా-2018’ ప్రదాన కార్యక్రమంలో సీఎండీ విజయానంద్‌ ఈ అవార్డు అందుకున్నారు.

  *ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఘంటా రామారావు
  రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఘంటా రామారావు ఎన్నికయ్యారు.
  2018 డిసెంబర్‌ 2న జరిగిన ఎన్నికల్లో మొత్తం 26 ఓట్లు పోల్‌ కాగా.. రామారావుకు 15 ఓట్లు, కృష్ణారెడ్డికి 11 ఓట్లు దక్కాయి. అయితే, ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పోస్టులో విడతలవారీగా ముగ్గురు కొనసాగడానికి అంతర్గతంగా ఒప్పందం కుదిరింది.
  దీని ప్రకారం తొలి ఏడాది ఘంటా రామారావు, తర్వాత రెండేళ్ల చొప్పున ఎన్‌.ద్వారకనాథరెడ్డి, వి.శ్రీనివాసరావు కొనసాగనున్నారు. వైస్‌ఛైర్మన్‌ పోస్టులకు కె.రామజోగేశ్వరరావు, ఎస్‌.కృష్ణమోహన్‌, ఆర్‌.మాధవి పోటీ పడ్డారు.
  రామజోగేశ్వరరావు, క ృష్ణమోహన్‌కు 12 ఓట్ల చొప్పున రాగా, మాధవికి 2 ఓట్లు లభించాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో మొదటి సగం పదవీ కాలంలో ఒకరు అనంతరం మరొకరు కొనసాగడానికి అంతర్గత ఒప్పందం కుదిరింది.

  *దివ్యాంగుల సంక్షేమ శాఖకు జాతీయ అవార్డు
  తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖకు ‘బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీస్’ అవార్డు లభించింది.
  డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును అందజేశారు. దివ్యాంగుల సాధికారత, పునరావాసం కోసం చేపట్టిన కార్యక్రమాలకుగాను రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. వ్యక్తిగత విభాగంలో దివ్యాంగుల సాధికారతకు విశేష కృషి చేసినందుకు సికింద్రాబాద్ కు చెందిన మంజులా కల్యాణ్ అవార్డును అందుకున్నారు.

  *టీ రేషన్ యాప్ కు ఈ గవర్నెన్స్ అవార్డు
  రేషన్ లావాదేవీలను సామాన్య ప్రజలు తెలుసుకునేలా తెలంగాణ పౌరసరఫరాల శాఖ రూపొందించిన ‘టీ రేషన్’యాప్ కు సీఎస్ఐ (కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా) ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది.
  ప్రభుత్వ సేవలు, సరుకుల సరఫరా నుండి పంపిణీ వరకు జరిగే అన్ని వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లబ్ధిదారుడికి సమీపంలో ఉన్న రేషన్ షాప్ లొకేషన్ సహా మొత్తం 13 అప్లికేషన్స్ తో ఈ యాప్ కు రూపొందించారు.