03 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  11

  *కవయిత్రి జూపాక సుభద్రకు కాళోజీ స్మారక పురస్కారం
  *సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన
  *వాలీబాల్ లీగ్ అంబాసిడర్‌గా పీవీ సింధు
  *క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ అవార్డు
  *భారత కోస్ట్‌గార్డ్‌లోకి ‘ఐసీజీఎస్ వరాహ’
  *యుకో బ్యాంక్ సీఈఓగా అతుల్ గోయెల్
  *రెజ్లింగ్ నుంచి యోగేశ్వర్ దత్ విరమణ

  *భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ నుంచి విరమించాడు.
  ఈ మేరకు తన 35వ పుట్టిన రోజు సందర్భంగా రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు నవంబర్ 2న యోగేశ్వర్ తెలిపాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల యోగేశ్వర్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం… 2014 కామన్వెల్త్ గేమ్స్… 2014 ఏషియన్ గేమ్స్‌లలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. చివరిసారిగా 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న యోగేశ్వర్ 2017లో వివాహం చేసుకున్నాడు. 2017లో హరియాణాలో అకాడమీని నెలకొల్పి 10 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న 80 మంది కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్ గా గుర్తింపు పొందిన బజరంగ్ పూనియా యోగేశ్వర్ శిష్యుడే.

  *యుకో బ్యాంక్ సీఈఓగా అతుల్ గోయెల్
  యుకో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా అతుల్ కుమార్ గోయెల్ నవంబర్ 2న బాధ్యతలు చేపట్టారు.
  ఇంతకుముందు ఆయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. 2018 నవంబర్ 1న యుకో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేసిన ఆర్కే ఠాకూర్ నుంచి గోయెల్ బాధ్యతలు స్వీకరించారు.

  *భారత కోస్ట్‌గార్డ్‌లోకి ‘ఐసీజీఎస్ వరాహ’
  సముద్రతీర రక్షణ చర్యలను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా భారత కోస్ట్‌గార్డ్‌లో ‘ఐసీజీఎస్ వరాహ’ నౌకను 2018 నవంబర్ 2న చెన్నైలో సముద్ర జలాల్లో ప్రవేశపెట్టారు.
  • 98ఎం ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌక(ఓవీపీ) సిరీస్‌లో నాలుగోది యార్డ్ 45004 రకం ‘ఐసీజీఎస్ వరాహ’ నౌక.
  • చెన్నై సమీపంలోని కాట్టుపల్లి వద్ద ఉన్న ఎల్అండ్టీ పోర్టులో ముంబైలోని వెస్ట్గార్డ్ రీజియన్ కమాండర్ వీడీ చఫేకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో కోస్ట్‌గార్డ్ వెస్ట్రన్ రీజియన్ తత్రక్షిక అధ్యక్షురాలు చిత్ర చఫేకర్ ఐసీజీఎస్ వరాహను ప్రారంభించారు.

  *వాలీబాల్ లీగ్ అంబాసిడర్‌గా పీవీ సింధు
  2019 ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్-1కు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
  ఈ మేరకు లీగ్ నిర్వహకులు నవంబర్ 2న తెలిపారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ… నా తల్లిదండ్రులు రమణ, విజయ వాలీబాల్ ఆటగాళ్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే చాలా ఇష్టం అని చెప్పింది.

  *సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన
  విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్ కొండపై నిర్మించనున్న నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీ కేంద్రానికి కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నవంబర్ 2న శంకుస్థాపన చేశారు.
  రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తీరప్రాంత కోత, రక్షణ, సముద్ర కాలుష్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. లక్షద్వీప్‌లో కొత్తగా 6 డిసాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరైక్టర్ జనరల్‌గా కేజే రమేష్ ఉన్నారు.

  *క్షయ నివారణలో ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమ అవార్డు

  క్షయ నివారణ చర్యల్లో కనబరుస్తున్న చొరవకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం ఉత్తమ పనితీరు పురస్కారాన్ని అందజేసింది.
  • అసోంలోని కజిరంగలో 2018 నవంబర్ 1న జరిగిన ‘ఉత్తమ విధానాలు-ఆవిష్కరణ’పై 5వ వార్షిక సదస్సు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాకొండయ్య ఈ అవార్డును అందుకున్నారు.
  • తల్లుల నుంచి శిశువులకు ఎయిడ్స్ వ్యాపించకుండా తీసుకుంటున్న ఉత్తమ చర్యలకు రాష్ట్రానికి కేంద్రం ప్రశంసా పత్రాన్ని అందచేసింది.
  • అనంతపురం జిల్లా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం, తూర్పుగోదావరి 6వ స్థానం దక్కించుకున్నందుకు ఈఎంటీసీటీ (ఎలిమినేషన్ ఆఫ్ మదర్ టూ ఛైల్డ్ ట్రాన్సిమిషన్) అఛీవర్స్ పురస్కారాన్ని కూడా కేంద్రం నుంచి రాష్ట్రం అందుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని 18 ఎయిడ్స్ నిర్ధరణ కేంద్రా(ఐసీటీసీ) పనితీరు ఉత్తమంగా ఉందని గుర్తించిన కేంద్రం సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను అందచేసింది.

  *కవయిత్రి జూపాక సుభద్రకు కాళోజీ స్మారక పురస్కారం

  ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్మారక పురస్కారం 2018 సం॥నికి గాను ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్రకు ప్రదానం చేయనున్నారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా నవంబరు 13న నిర్వహించే సభలో ఆమెను ఈ అవార్డు కింద రూ.10 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించనున్నారు.